Sajjala: టీడీపీ భవిష్యత్ ఏంటో కుప్పం ఫలితం ఒక్కటి చాలు.. మాపై ప్రజలు మరింత భారం పెట్టారు: సజ్జల
టీడీపీ భవిష్యత్ ఏంటో కుప్పం ఫలితం ఒక్కటి చాలని జగన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Sajjala Ramakrishna Reddy: టీడీపీ భవిష్యత్ ఏంటో కుప్పం ఫలితం ఒక్కటి చాలని జగన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పరిషత్ ఎన్నికల్లో విజయంతో మాపై ప్రజలు మరింత భారం పెట్టారని, వారి విశ్వాసాన్ని సీఎం వైయస్ జగన్ నిలుపుకుంటున్నారని ఆయన తెలిపారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో అమరావతిలో మాట్లాడారు.
“రెండేళ్ల వైయస్ జగన్‌పాలన ఎలా ఉందని అడిగితే..ఇలా ఉంటుందని పరిషత్ ఎన్నికల ఫలితాలు ఇచ్చారు. మూడోసారి కూడా ఫలితాలు రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మూడోదఫా పార్టీ హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తోంది. పార్టీ శ్రేణులందరికీ వైయస్ జగన్ తరఫున, పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.” అని సజ్జల చెప్పుకొచ్చారు.
ఎలా ఉంటే ప్రజలు అక్కున చేర్చుకుంటారన్నది ఈ ఫలితాల ద్వారా వెల్లడైందని సజ్జల చెప్పారు. “మా ఆనందాన్ని వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిన నిమ్మగడ్డకు, ఆయన వెనుక ఉన్న చంద్రబాబుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దీవాళ తీసి అడ్డంగా ఐపీ పెట్టిందా అన్నట్లుగా ఉన్న టీడీపీని ఎత్తి చూపుతున్నాం. ఈ రోజు అచ్చెన్నాయుడు అన్నారట. దమ్ముంటే ఎన్నికలు పెట్టమంటున్నారట. ఎన్నికల్లో తప్పుకున్న టీడీపీ నేతలు మళ్లీ ఎన్నికలు పెట్టమని అంటున్నారు. వీరి మాటలు చూస్తే పాత సామెత గుర్తుకు వస్తుంది. బొక్కబోర్లపడి 2019లో ముక్కు, మూతి సొట్టపోయింద. అప్పటికైనా బుద్ది తెచ్చుకోకుండా మాట్లాడుతున్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, ఎక్కడో కొంపలు అంటుకుపోతున్నాయని భావించి ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు” అని సజ్జల విమర్శించారు.
వైయస్ జగన్ పథకాలు ప్రలోభపెట్టేవి కావు. అన్ని వర్గాల ఆర్థిక,సామాజిక, స్వాతంత్య్రం, నిజమైన సమానత్వం ఇవ్వగలిగితే ..ఎవరికి వాళ్లు తమ సొంత కాళ్లపై నిలబడగలిగితే..ఎలా ఉంటాయో ఫలితాలు అన్నవి ఈ రెండేళ్ల పాలనలో చేసి చూపించారు. ఈ ఫలితాలు సువర్ణ అక్షరాల్లో రాసుకోవచ్చు అని సజ్జల వ్యాఖ్యానించారు.
Read also: KTR: కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తిన బోర్గ్ బ్రాండె.. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి రమ్మని మళ్లీ ఆహ్వానం