Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Video: అయ్యో పాపం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇరుక్కున్న కోతి పిల్ల.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Monkey Video: భద్రాచలం పట్టణంలో హృదవిదారక ఘటన వెలుగు చూసింది. ఓ కొతి పిల్ల పొరపాటున కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇరుక్కుపోయింది.

Monkey Video: అయ్యో పాపం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇరుక్కున్న కోతి పిల్ల.. ఆ తరువాత ఏం జరిగిందంటే..
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 19, 2021 | 9:47 PM

Monkey Video: భద్రాచలం పట్టణంలో హృదవిదారక ఘటన వెలుగు చూసింది. ఓ కొతి పిల్ల పొరపాటున కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఇరుక్కుపోయింది. అయితే, అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంతో వ్యవహరించి దానిని ప్రాణాలతో కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఓ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఓ కోత్తి పిల్ల పొరపాటున ఇరుక్కుపోయింది. అలా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. అయితే, ఇది గమనించిన జంతు ప్రేమికులు.. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది.. హుటాహుటిన ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు చేరుకున్నారు. అందులో ఇరుక్కుపోయిన కోతి పిల్లను కాపాడటానికి ప్రయత్నించారు. అయితే, అక్కడే కోతుల మూక.. తమ కోతి పిల్లను ఏదో చేస్తున్నారని ఆందోళనకు గురయ్యాయి. ఆ క్రమంలో కోతి పిల్లను కాపాడటానికి ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించాయి. అయినప్పటికీ.. శ్రమించి ఆ కోతి పిల్లను కాపాడారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన కోతి పిల్లలు జంతు వైద్యశాలకు తరలించారు. మొత్తంగా సరైన సమయానికి దానికి వైద్యం అందడటంతో కోతి ప్రాణాలతో బయటపడింది. కోతి పిల్లలను కాపాడిన ఫైర్ సిబ్బందిని, జంతు ప్రేమికులను స్థానికులు అభినందించారు.

Video:

Also read:

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.

Mehreen Pirzada Photos: అల్లరి అందం ఒకేచోట ఒకరి దగ్గరే ఉంటె ఫన్ పీక్స్.. ఎఫ్3 సెట్ లో మెహ్రీన్ ఫొటోస్..

Nalla Ummethha: స్త్రీలు స్తనాల వాపులతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆకులు దివ్య ఔషధం.. ఎలా ఉపయోగించాలంటే