AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.

Chiranjeevi: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడం, షూటింగ్‌లు వాయిదా పడడంతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంది...

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు.
Narender Vaitla
|

Updated on: Sep 19, 2021 | 9:40 PM

Share

Chiranjeevi: కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడం, షూటింగ్‌లు వాయిదా పడడంతో చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంది. చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్‌, నటీనటులు ఇలా అందరూ ఆర్థికంగా చితికిపోయారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రభుత్వాలపై ఉందని చెప్పారు మెగా స్టార్‌ చిరంజీవి. తాజాగా నాగచైతన్య హీరోగా తెరకెక్కుతోన్న ‘లవ్‌స్టోరీ’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా చిరంజీవి ఏం మాట్లాడారంటే..

‘ఎలాంటి విపత్తు జరిగినా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. కానీ, కరోనా కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది. పరిశ్రమ సాధక, బాధకాలను గుర్తించి తగిన సాయం చేయండి’ అని చెప్పుకొచ్చారు. ఇక కోవిడ్‌ తర్వాత ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొనడం చిన్నపిల్లవాడు స్కూల్‌కు వెళ్తున్న భావన కలుగుతోందని చెప్పుకొచ్చారు చిరు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సినీ పరిశ్రమలో ఎదుర్కొంటున్న కష్టాల గురించి మాట్లాడిన చిరు.. ‘చిత్ర పరిశ్రమలో సక్సెస్‌రేట్‌ అనేది చాలా తక్కువ. 10-15శాతం మాత్రమే ఉంటుంది. మహా అయితే, 20శాతం. ఈ మాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా,  కళకళలాడిపోతోందంటారు. కానీ, ఇక్కడ కూడా కష్టాలు పడేవారు, రెక్కాడితే కానీ, డొక్కాడని కార్మికులు ప్రత్యక్షంగా వేల మంది.. పరోక్షంగా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇలాంటి వాళ్లందరూ కలిస్తేనే చిత్ర పరిశ్రమ. నలుగురైదుగురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు కలిస్తే ఇండస్ట్రీ అవదు. వీళ్లు బాగున్నారు కదాని, సినిమా ఇండస్ట్రీ బాగుందనుకుంటే మెరిసేదంతా బంగారం కాదు’ అని చెప్పుకొచ్చారు.

ఇక లవ్‌స్టోరీ సినిమా విషయానికొస్తే.. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రీరిలీజ్‌ వేడుక జరిగింది. ఈ ఈవెంట్‌కు బాలీవుడ్‌ హీరో ఆమీర్‌ఖాన్, చిరంజీవి ముఖ్య అతిథితులుగా హాజరయ్యారు.

Also Read: Ganesh Immersion 2021: ఓ భక్తుడి వినూత్న ప్రయత్నం.. ఇలా కూడా వినాయక నిమజ్జనం చేస్తారా అంటూ షాక్ అవుతున్న జనాలు..!

Songbirds Crash: పక్షుల పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్న ఆకాశ హార్మ్యాలు..వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద భారీ సంఖ్యలో మృతి

Train Reservation: ట్రైన్‌లో మనకు బెర్త్ రిజర్వేషన్ నెంబర్ దేని ఆధారంగా కేటాయిస్తారో తెలుసా? కీలక వివరాలు మీకోసం..