Megastar Chiranjeevi: సాయిపల్లవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్.. అసలు కారణం ఇదే..
మెగాస్టార్ చిరంజీవి... తెలుగు చిత్రపరిశ్రమలో ఓ సంచలనం. రీఎంట్రీ తర్వాత చిరు జోరు మాములుగా లేదు. వరుస ప్రాజెక్స్ను పట్టాలెక్కిస్తూ
మెగాస్టార్ చిరంజీవి… తెలుగు చిత్రపరిశ్రమలో ఓ సంచలనం. రీఎంట్రీ తర్వాత చిరు జోరు మాములుగా లేదు. వరుస ప్రాజెక్స్ను పట్టాలెక్కిస్తూ బిజీగా ఉంటున్నారు. ఇటీవలే ఆచార్య సినిమాను పూర్తిచేసిన చిరు.. ఆ తర్వాత వెంటనే.. గాడ్ ఫాదర్.. భోళా శంకర్ సినిమాలను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్స్‌లో పాల్గోంటూ బిజీగా ఉంటున్నారు. అయితే రాఖీ పండుగ… అలాగే చిరంజీవి బర్త్ డే కావడంతో.. తన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రివీల్ చేస్తూ.. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. అయితే ఇందులో భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెల్లిగా హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది. ముందుగా ఈ పాత్ర కోసం టాలెంటెడ్ హీరోయిన్ను అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత తను రిజెక్ట్ చేసిందని.. దీంతో కీర్తి సురేష్ ను సంప్రదించినట్లుగా కొద్దిరోజుల కథనాలు వచ్చాయి.
తాజాగా ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నిజంగానే సాయి పల్లవి తన సినిమాను రిజెక్ట్ చేసిందని.. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు. అక్కినేని నాగచైతన్య… సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా ఈనెల 24న థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు… అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. సాయి పల్లవి భోళా శంకర్ సినిమాలో తన చెల్లెలిగా నటించాలని అడిగితే.. అందుకు ఆమె నో చెప్పిందన్నారు. అయితే ఆమె నో చెప్పిందనకు తనకు చాలా సంతోషం కలిగిందని తెలిపారు. సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు చిరు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు. ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. చాలామంది ఎంగ్ స్టర్స్ ఎగిరెగిరి పడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్‌గా, కంపోసుడ్‌గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జున లానే.. కూల్ ఫాదర్‌కి కూల్ సన్ అని చిరు పేర్కొన్నారు.
Also Read: కాజోల్ అజయ్ దేవగన్ నాటి నుంచి నేటి వరకు మధురానుభూతులు… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫొటోస్
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Live AP MPTC ZPTC Elections Counting Live: పరిషత్ పంచాయతీ.. ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ..