Keerthy Suresh: సౌందర్య చేసిన ప్రయోగం మళ్ళీ చేయడానికి రెడీ అయిన ‘మహానటి’.. అద్దెకు గర్భం.. సక్సెస్ అవుతుందా..

Keerthy Suresh: సీనియర్ నటి మేనక కూతురు కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వైవిధ్య సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో..

Keerthy Suresh: సౌందర్య చేసిన ప్రయోగం మళ్ళీ చేయడానికి రెడీ అయిన 'మహానటి'.. అద్దెకు గర్భం.. సక్సెస్ అవుతుందా..
Mimi Movie
Follow us
Surya Kala

|

Updated on: Sep 19, 2021 | 7:38 PM

Keerthy Suresh: సీనియర్ నటి మేనక కూతురు కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వైవిధ్య సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతుంది. కీర్తిసురేష్ బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. తర్వాత మలయాళంలో గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో కీర్తి సురేష్ సీనియర్ నటుడు నవీన్ మూవీలో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. అయితే నేను శైలజ సినిమాతో గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ మొదటి నుంచి కీర్తి వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. కీర్తి కెరీర్ లో మహానటి సావిత్రి సినిమా స్పెషల్.. ఇందులో మహానటిగా నటించి విమర్శకుల ప్రశంసలను సైతం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ మరో ప్రయోగానికి సిద్ధపడినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ హిట్ మూవీ ‘మిమి’ ని తెలుగు, తమిళ భాషలో నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఆసక్తిని చూపిస్తుందట.. మిమి.. మూవీలో కృతిసనన్‌ కీలక పాత్రలో నటించగా లక్ష్మణ్‌ ఉత్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అద్దె గర్భంతో ఓ యువతి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? వాటి నుంచి ఎలా బయటపడిందన్న ఇతివృత్తంతో మనిషి మదిని ఆకట్టుకునే విధంగా భావోద్వేగభరితంగా ఈ సినిమా సాగుతుంది. మిమి లో కృతిససన్‌ నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాను రీమేక్ చేయాలనీ భావిస్తున్న నిర్మాణ సంస్థ కృతిసనన్ పాత్రలో కీర్తి సురేష్ కోసం సంప్రదిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్. . స్క్రిప్ట్‌ విన్న కీర్తి సినిమా చేసేందుకు కీర్తి ఆసక్తిని చూపిస్తుందట.

అయితే అద్దె గర్భం థీమ్ తో దివంగత నటి సౌందర్య తొమ్మిది నెలలు సినిమాలో నటించగా.. ఇక సింగీతం శ్రీనివాసరావు ‘వెల్‌కమ్‌ ఒబామా’ గాను తెరకెక్కించారు. ఈ నేపథ్యంలో ‘మిమి’లో ఎటువంటి మార్పులతో తెలుగు తెరపైకి తీసుకొస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కీర్తి సురేశ్‌ .. మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్‌’, మహేశ్‌ బాబుతో ‘సర్కారు వారి పాట’, రజనీకాంత్ ‘అన్నాత్తే’ మొదలైన సినిమాతో కెరీర్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:   బర్గర్‌లో బయట పడిన మనిషి వేలు.. బర్గర్ తింటున్న యువతికి షాక్.. సోషల్ మీడియాలో వైరల్