Human Finger in Burger: బర్గర్‌లో బయట పడిన మనిషి వేలు.. బర్గర్ తింటున్న యువతికి షాక్.. సోషల్ మీడియాలో వైరల్

Human Finger in Burger: హోటల్స్ లో ఫుడ్ తినే ముందు జాగ్రత్తగా ఉండాలని మరొకసారి ఈ ఘటన హెచ్చరిస్తుంది. ఓ మహిళ.. రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన..

Human Finger in Burger: బర్గర్‌లో బయట పడిన మనిషి వేలు.. బర్గర్ తింటున్న యువతికి షాక్.. సోషల్ మీడియాలో వైరల్
Ginger In Burger
Follow us
Surya Kala

|

Updated on: Sep 19, 2021 | 7:16 PM

Human Finger in Burger: హోటల్స్ లో ఫుడ్ తినే ముందు జాగ్రత్తగా ఉండాలని మరొకసారి ఈ ఘటన హెచ్చరిస్తుంది. ఓ మహిళ.. రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన బర్గర్ లో మనిషి వేలు బయటపడింది. దీంతో ఆ మహిళ ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వినియోదారుల సహాయ మంత్రి ప్రకటించారు. ఈ విచిత్రమైన ఘటన దక్షిణ అమెరికాలోని బొలీవియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

బొలీవియాలోని శాంటా క్రజ్‌లోని రెస్టారెంట్ లో ఒక మహిళ బర్గర్ ఆర్డర్ ఇచ్చింది. ఆ బర్గర్ ను తినడానికి ఆ మహిళ ప్రయత్నిస్తున్న సమయంలో అందులో మనిషి వేలి బయపడింది. దీంతో రెస్టారెంట్ నిర్లక్ష్యానికి గుర్తు అంటూ.. వేలు ఉన్న బర్గర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సదరు మహిళ. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. దీంతో ఆ దేశంలో ప్రస్తుతం ఈ విషయంపై తీవ్ర వివాదం నెలకొంది. రెస్టారెంట్ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై వినియోగదారుల రక్షణ శాఖ సహాయ మంత్రి జార్జ్ సిల్వా స్పందిస్తూ.. ఈ ఘటనకు భాద్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

బర్గర్ లోపల కార్మికుడి వేలు పై డిప్యూటీ మంత్రి జార్జ్ సిల్వా స్పందిస్తూ.. పని చేస్తున్న కార్మికుడు తన వేలుని కోల్పోయాడని.. కార్మికుడి వేలులో కొంత భాగం బర్గర్ లోకి వచ్చిందని చెప్పారు. గత శుక్రవారం ఓ కార్మికుడు తన రెండు వేళ్లు కోల్పోయాడని.. అందులోని కొంతభాగం మహిళకు ఇచ్చిన బర్గర్ లో ఉందని దర్యాప్తులో తేలిందని చెప్పారు. బాధ్యులైన వారికి చట్టం ప్రకారం కనీసం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని సిల్వా అన్నారు.

ఇదే విషయంపై స్థానిక మీడియాలో ఓ కథనం ప్రచురించారు.. మాంసం-గ్రౌండింగ్ ఫ్యాక్టరీలోని ఒక కార్మికుడు కటింగ్ యంత్రాన్ని నిర్వహిస్తున్న సమయంలో తన రెండు వేళ్లు కోల్పోయాడు. కార్మికుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అతని వేలి ఒకటి కనిపించలేదు. అయితే ఈ ఫ్యాక్టరీలో మాసం యధావిధిగా సమీపంలోని దాదాపు 20 రెస్టారెంట్లకు సరఫరా చేశారు. దీంతో ఆ కార్మికుడి వేలు మహిళ ఆర్డర్ చేసిన బర్గర్ లో బయపడింది.

రెస్టారెంట్ యాజమాన్యం ఈ విషయంపై స్పందిస్తూ.. తాము 21 ఏళ్లకు పైగా ఈ వ్యాపారంలో ఉన్నామని.. కస్టమర్ల ఆరోగ్యం. భద్రత, ఆహార భద్రతా నియమాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

Also Read:  గృహస్థ ధర్మం అంటే ఏమిటి.. సంసారం బంధాలను అధిగమించాలంటే ఏమి చెయ్యాలో చెప్పిన శౌనకుడు..