Train Reservation: ట్రైన్‌లో మనకు బెర్త్ రిజర్వేషన్ నెంబర్ దేని ఆధారంగా కేటాయిస్తారో తెలుసా? కీలక వివరాలు మీకోసం..

Train Reservation: సినిమా హాల్‌లో మనకు నచ్చిన సీటును బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఐఆర్‌సీటీసీలో మనకు ఆ వెసులు బాటు ఉండదు.

Train Reservation: ట్రైన్‌లో మనకు బెర్త్ రిజర్వేషన్ నెంబర్ దేని ఆధారంగా కేటాయిస్తారో తెలుసా? కీలక వివరాలు మీకోసం..
Train

Train Reservation: సినిమా హాల్‌లో మనకు నచ్చిన సీటును బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఐఆర్‌సీటీసీలో మనకు ఆ వెసులు బాటు ఉండదు. కేవలం అప్పర్ బెర్త్ కావాలా? మిడిల్ బెర్త్ కావాలా? లోయర్ బెర్త్ కావాలా? అని మాత్రమే సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఒక రైలు బోగీలో 72 బెర్త్‌లు మాత్రమే ఉంటాయి. అందులో మనకు నచ్చిన నెంబర్ బెర్త్‌ను బుక్ చేసుకోవడానికి వీలు లేదు. దానికి కారణం సైంటిఫికల్ ఇష్యూస్ అని నిపుణులు చెబుతున్నారు.

సాంకేతిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. సినిమా హాల్‌లో సీట్ బుకింగ్ వేరు.. ట్రైన్‌లో సీటు బుకింగ్ వేరు. సినిమా హాల్ నిశ్చలంగా ఉండే ఒక విశాలమైన గది మాత్రమే. కానీ, ట్రైన్ పరుగుత్తే పొడవాటి గదుల(బోగీలు) సమూహం. ఇక్కడే అసలు లాజిక్ దాగి ఉంది. అలా పరుగులు తీసే ట్రైన్.. ప్రయాణికులకు ప్రమాదకరంగా ఉండకుండా.. ప్రయాణం క్షేమంగా జరగాలనే కీలక అంశం ఇందులో దాగి ఉంది. ప్రయాణించే ట్రైన్‌లో బరువు అంతటా సమానంగా పంపిణీ అయ్యే విధంగా భారతీయ రైల్వే టికెట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్‌ను రూపుదిద్దారు.

ఉదాహరణకు.. ఒక ట్రైన్‌లో S1 నుండి S10 వరకు స్లీపర్ క్లాస్ బోగీలు ఉన్నాయనుకుందాం. ఒక్కొక్క బోగీలో 72 సీట్లు ఉంటాయి. అందువల్ల, మొట్టమొదట టికెట్ బుక్ చేసుకునేవారికి మధ్యలో ఉన్న బోగీలో (S5 లేదా S6లో) టికెట్ కేటాయించడం జరుగుతుంది. పైగా అందులో కూడా 30–40 నెంబర్ సీటు కేటాయించడం జరుగుతుంది. ఇందులోనూ లోయర్ బెర్త్ కేటాయింపబడుతుంది(ఎలాంటి బెర్త్ కావాలో మనం ఎంచుకోకపోతే). దీనికి కూడా రీజన్ ఉంది. ట్రైన్‌లో గ్రావిటీ సెంటర్లు సాధ్యమైనంత తక్కువగా ఉండేందుకు గానూ అప్పర్ బెర్త్‌ల కంటే ముందుగా లోయర్ బెర్త్‌లను కేటాయిస్తారు.

ఇలా మొదటగా మధ్యలో ఉండే బోగీలలో, మధ్య సీట్లు.. అలా క్రమక్రమంగా చివరి సీట్లు(మొదట లోయర్ బెర్త్, ఆ తరువాతే అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్) కేటాయింపబడతాయి. ఆ తరువాత మధ్య బోగీలకు పక్కన ఉండే బోగీలలో (S4, S7) మరలా అదే విధంగా సీట్ల కేటాయింపు జరుగుతూ పోతుంది. ఇలా బరువు అన్ని రైలు బోగీలలోనూ సమానంగా ఉండే విధంగా టికెట్ల కేటాయింపు జరుగుతుంది. ఇక మనం చివరి నిమిషాల్లో టికెట్ కోసం ప్రయత్నించినపుడు మనకు అప్పర్ బెర్త్‌లు, 1-6 లేదా 66-72 నంబర్ సీట్లు కేటాయించడానికి కారణం ఇదే. ఇక మనం వెయిటింగ్ లిస్టులో ఉన్నపుడు ఎప్పుడైనా.. ఎవరైనా.. తమ సీట్‌ను క్యాన్సిల్ చేసుకుంటే మనకు మధ్యలో కూడా సీటు దొరకవచ్చు.

నచ్చినట్లు సీట్లు కేటాయిస్తే ఏం జరుగుతుంది..?
S1, S2, S3 బోగీలు ప్రయాణికులతో నిండుగా కిటకిటలాడుతున్నాయి. S5, S6 బోగీలు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన బోగీలలో ప్రయాణికులు అరకొరగా ఉన్నారనుకుందాం. అయితే, ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ ఒక్కొక్కసారి గంటకు 100 కిలోమీటర్లకు పైగా వేగంతో పరుగెడుతుంటాయి. ఆ వేగం వలన చాల బలమైన గమనశక్తి కలుగుతుంది. అదే వేగంలో ట్రైన్ ఒక మలుపు తిరగవలసి వచ్చిందనుకోండి.. ఆ సమయంలో అసమభారం కలిగిన బోగీలన్నింటిమీద కేంద్ర పరాన్ముఖ బలం(సెంట్రి-ఫ్యూగల్ ఫోర్స్) సమానంగా ఉండటం సాధ్యం కాదు. అందువల్ల ట్రైన్ ఫుల్ స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు.. బరువు కలిగిన బోగీలు ఒకవైపు వంగితే.. బరువు లేని బోగీలు మరోవైపు వంగే అవకాశం ఉంది. అలా ట్రైన్ పట్టాలు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అంతేకాదు.. అసమానమైన బరువు కలిగిన బోగీలు ట్రైన్‌లో ఉన్నప్పుడు బ్రేకులు వేస్తే అన్ని బోగీల మీద సమానమైన వత్తిడి పడదు. అప్పుడు కూడా ట్రైన్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే.. ప్రజల సౌకర్యార్థం కంటే.. ప్రజల క్షేమం కోరి ట్రైన్‌లో బెర్త్‌లను కేటాయిస్తుంది ఐఆర్‌సీటీసీ.

Also read:

Tirumala Temple: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..

Keerthy Suresh: సౌందర్య చేసిన ప్రయోగం మళ్ళీ చేయడానికి రెడీ అయిన ‘మహానటి’.. అద్దెకు గర్భం.. సక్సెస్ అవుతుందా..

Viral Video: గాఢ నిద్రలో పిల్ల ఏనుగు.. జడుసుకున్న తల్లి ఏనుగు.. ఆ తర్వాత ఏం చేసిందంటే..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu