- Telugu News Photo Gallery Technology photos Vivo Launches 3 New Smartphones Vivo X70 Series Have Look On Features And Price
Vivo X70: వివో నుంచి కొత్త సిరీస్ ఫోన్‌లు వచ్చేస్తున్నాయి… ఫొటో క్లారిటీ కోసం ప్రత్యేక టెక్నాలజీ..
Vivo X70: చైనాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం వివో తాజాగా ఇండియన్ మార్కెట్లోకి వివో ఎక్స్ 70 సిరీస్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఈ నెల 30న అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ల ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Narender Vaitla | Edited By: Anil kumar poka
Updated on: Sep 20, 2021 | 8:45 AM

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వివో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్‌లను తీసుకొస్తూ మార్కెట్‌ను పెంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వివో ఎక్స్ సిరీస్‌ను తీసుకొస్తోంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 30న భారత్‌లో లాంచ్ కానుంది.

వివో ఎక్స్ సిరీస్‌లో భాగంగా వివో ఎక్స్70, వివో ఎక్స్70 ప్రో, వివో ఎక్స్70 ప్రో ప్లస్ 5జీ ఫోన్లను విడుదల చేయనుంది. ఈ ఫోన్‌లో వివో ఫొటోగ్రఫీ కోసం ప్రత్యేకంగా జైస్ అనే టెక్నాలజీతో రూపొందించారు. దీంతో ఫోటో క్లారిటీ స్పష్టంగా ఉంటుంది.

వివో ఎక్స్ 70 సిరీస్ ఫోన్‌లో 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఎస్‌వోసీ ప్రాసెసర్‌ను అందించారు.

ఇక కెమెరాకు అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 40 ఎంపీ కెమెరాను అందించారు. 4400 ఎంఏహెచ్ బ్యాటరీతో 44 వాట్స్ ఫ్లాష్ చార్జ్ ఫీచర్లను ప్రత్యేకంగా అందించారు.

ఇక వివో ఎక్స్70 ప్రో విషయానికొస్తే ఇందులో 6.56 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, 12 జీబీ వరకు ర్యామ్ కెపాసిటీ, 512 జీబీ స్టోరేజ్ అందించారు.

ఈ సిరీస్‌లో వస్తోన్న మరో ఫోన్ వివో ఎక్స్70 ప్రో ప్లస్‌లో 6.8 ఇంచ్ అల్ట్రా హెచ్‌డీ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ఎస్‌వోసీ, 50 వాట్స్ వైర్‌లెస్ ఫ్లాష్ చార్జ్ ఫీచర్లను అందించారు.





























