Gaddar: కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర.. కట్టుదిట్టంగా పోలీసుల నిఘా.. ఎందుకంటే ?

గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుండి అల్వాల్ వరకు సాగుతున్న నేపథ్యంలో.. వేలాదిమందిగా అభిమానులు అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వచ్చేటటువంటి వ్యక్తుల కదలికలను పోలీసులు గమనిస్తున్నారు. గద్దర్‌తో ఉద్యమంలో కలిసి పనిచేసిన చాలామందిపై కేసులు నమోదై ఉన్నాయి. కొంతమంది జైలుకు వెళ్లి రాగా మరికొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు.

Gaddar: కొనసాగుతున్న గద్దర్ అంతిమయాత్ర..  కట్టుదిట్టంగా పోలీసుల నిఘా.. ఎందుకంటే ?
Gaddar
Follow us
Ranjith Muppidi

| Edited By: Aravind B

Updated on: Aug 07, 2023 | 3:55 PM

ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమయాత్రపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గద్దర్ అంత్యక్రియల సందర్భంగా మాజీ మావోయిస్టులు, సానుభూతిపరులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతిమయాత్రపై పోలీసులు నిఘా వర్గాలను రంగంలోకి దించారు. ఇందుకోసం సీసీ కెమెరా మౌంటెడ్ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నారు. గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుండి అల్వాల్ వరకు సాగుతున్న నేపథ్యంలో.. వేలాదిమందిగా అభిమానులు అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వచ్చేటటువంటి వ్యక్తుల కదలికలను పోలీసులు గమనిస్తున్నారు. గద్దర్‌తో ఉద్యమంలో కలిసి పనిచేసిన చాలామందిపై కేసులు నమోదై ఉన్నాయి. కొంతమంది జైలుకు వెళ్లి రాగా మరికొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు. అలాంటి వారిలో చాలామంది ఆయనను కడసారి చూసేందుకు అంతిమయాత్రలో పాల్గొనే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అంతిమయాత్రపై నిఘా పెట్టారు పోలీసులు. సుమారు 12 కిలోమీటర్ల మేర సాగనున్న అంతిమయాత్ర సందర్భంగా వచ్చేటటువంటి వ్యక్తుల కదలికలను మౌంటెడ్ సీసీ కెమెరా వెహికల్ ద్వారా గమనిస్తున్నారు. ఇక మఫ్టీలో ఉన్న పోలీసులు సైతం గద్దర్ అంతిమయాత్ర సాధారణ జనంతో కలియ తిరుగుతూ.. నక్సలైట్లను లేదా సానుభూతిపరులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పాటలతో ప్రజల్లో చైతన్య స్ఫూర్తిని రగిలించిన ప్రజా గాయకుడు గద్దర్.. గత నెల 20న గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరారు. గుండె రక్తనాళాలు మూసుకుపోయినట్టు నిర్ధారించిన డాక్టర్లు.. ఈనెల 3న సర్జరీ చేశారు. అంతకుముందు నుంచే మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యల కారణంగా గద్దర్‌ ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఆదివారం రోజున తుదిశ్వాస విడిచారు. అయితే జూలై 31న హాస్పిటల్‌ నుంచి మీడియాకు స్వయంగా లేఖ రాశారాయన. సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని మాట ఇచ్చారు. కానీ అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. హార్ట్ సర్జరీ తర్వాత పూర్తిగా కోలుకుని సాంస్కృతిక ఉద్యమం ప్రారంభించి.. ప్రజల రుణం తీర్చుకుంటానని భావించారు. కానీ ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

నక్సలైట్లు…చీకట్లో మగ్గుతున్న సమాజానికి టార్చిలైట్లు అంటూ జనంలోకి పాట రూపంలో దూసుకెళ్లారు. వెదురు పూల తోటలో పూసిన విప్లవ పాటకు వైతాళికుడుగా మారారు. AK-47 తూటాల కంటే గద్దర్‌ పాటలే పవర్‌ఫుల్‌ అని పోలీస్‌ బాసులే ఆనాడు స్వయంగా చెప్పారు. ఏకే -47 కంటే డేంజర్‌ ఈ గద్దర్‌ అంటూ అప్పట్లో ఆయన కోసం తెలంగాణను జల్లెడ పట్టేవాళ్లు పోలీసులు. ఈ గాలిలో నేలలో ఉద్యమంలో జనం ఊపిరిలో ఉనికిలో పాటై వెలిగారు గద్దర్‌. ఎరుపెక్కిన కళ్లతో రేపటి సూర్యోదయాన్ని కలగన్నారు. గద్దర్‌ పాట అంటేనే ఒక ఉప్పెన.. మొదట్లో బుర్రకథలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగించినా, నక్సలైట్ల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపు తెచ్చినా.. ఆయన గొంతు సైరన్‌ మోగించేది. శ్రీకాకుళం సీతంపేట నుండి మొదలైన తిరుగుబాటు పాట, జగిత్యాల జైత్రయాత్ర, కల్లోల కరీంనగర్‌ వరకు సాగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి గద్దర్‌ పాటలు ప్రాణం పోశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..