Telangana: ఆస్తి వివాదం కారణంగా ఆగిపోయిన అంత్యక్రియలు.. నాలుగు రోజులుగా ఆసుపత్రిలోనే మృతదేహం
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. మనిషి అంతిమ సంస్కారాలకు ఈ ఆర్థిక సంబంధాలే అడ్డుగా నిలుస్తున్నాయి. భూ వివాదంతో చనిపోయిన తమ్ముడు అంత్యక్రియలు నిలిచిపోయాయి. భూమి తమకు దక్కేవరకు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ససేమిరా అంటున్నారు. నాలుగు రోజులుగా ఆ మృతదేహం ఆసుపత్రి మార్చురీలోనే ఉండిపోయింది. వివరాల్లోకి వెళితే..

మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయి. మనిషి అంతిమ సంస్కారాలకు ఈ ఆర్థిక సంబంధాలే అడ్డుగా నిలుస్తున్నాయి. భూ వివాదంతో చనిపోయిన తమ్ముడు అంత్యక్రియలు నిలిచిపోయాయి. భూమి తమకు దక్కేవరకు అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ససేమిరా అంటున్నారు. నాలుగు రోజులుగా ఆ మృతదేహం ఆసుపత్రి మార్చురీలోనే ఉండిపోయింది. వివరాల్లోకి వెళితే..
నల్లగొండ జిల్లా హాలియా మండలం యాచారంలో బైరు చెన్నయ్య, బైరు సైదులు వ్యవసాయం సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అన్నదమ్ములుగా ఉన్న వీరిద్దరికీ వారసత్వంగా వచ్చిన భూమిని సాగు చేసుకుంటున్నారు. తండ్రి మృతి చెందడంతో వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిని పెద్దకొడుకు చెన్నయ్య పేరిట పట్టా మార్పిడి జరిగింది. ఈ నాలుగు ఎకరాల భూమి విషయంలో అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా వివాదం ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ వివాదంపై ఇప్పటికే అన్నదమ్ములిద్దరు కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ భూమి వివాదంలో నాలుగు రోజుల క్రితం అన్నదమ్ముల కుటుంబాలు ఇద్దరు ఘర్షణ పడ్డాయి. చెన్నయ్య కుటుంబ సభ్యులు చేసిన దాడిలో సైదులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో సైదులు చనిపోయాడు. భూమి పట్టా విషయంలో తమకు న్యాయం చేయాలంటూ సైదులు మృతదేహంతో చెన్నయ్య ఇంటి ముందు ఆందోళన చేశారు.
సైదులు కూతురు పూజిత ఫిర్యాదు మేరకు హాలియా పోలీసులు చెన్నయ్య కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. సైదులు మృతదేహానికి నాగార్జున సాగర్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు సైదులు కుటుంబ సభ్యులు ససేమిరా అంటున్నారు. తమ వాటా భూమిని తమకు పట్టా చేసే వరకు మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేది లేదని సైదులు కుటుంబ సభ్యులు తెగేసి చెబుతున్నారు. దీంతో నాలుగు రోజులుగా సైదులు మృతదేహం నాగార్జున సాగర్ ఆస్పత్రిలోనే ఉంది. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సైదులు మృతి దేహానికి అంత్యక్రియల నిర్వాహనపై సైదులు కుటుంబ సభ్యులకు గ్రామ పెద్దలు నచ్చజేబుతున్నారు. ఈ భూ వివాద పరిష్కారానికి గ్రామ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..