AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro: గుడ్‌ న్యూస్ చెప్పిన కేటీఆర్‌.. ఇకపై ఆ మార్గంలోనూ మెట్రో రైలు కూత.. సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌ నగరంలో మరో మార్గంలో మెట్రో రైలు కూత పెట్టనుంది. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెట్రో రైలు సేవలను పాత బస్తీ వరకు విస్తరించనున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Hyderabad Metro: గుడ్‌ న్యూస్ చెప్పిన కేటీఆర్‌.. ఇకపై ఆ మార్గంలోనూ మెట్రో రైలు కూత.. సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌
Hyderabad Metro
Basha Shek
|

Updated on: Jul 11, 2023 | 12:55 PM

Share

హైదరాబాద్‌ నగరంలో మరో మార్గంలో మెట్రో రైలు కూత పెట్టనుంది. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెట్రో రైలు సేవలను పాత బస్తీ వరకు విస్తరించనున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా మెట్రో ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇందుకోసం సుమారు 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ ఎల్‌ అండ్‌ టీ సంస్థ అధికారులు, మున్సిపల్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు మంత్రి కేటీఆర్‌. మెట్రో కారిడార్‌-2లో భాగమైన ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా రూట్‌కు గతంలోనే సర్వే పూర్తయింది. మొత్తం 16 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో ఇప్పటికే ఎంజీబీఎస్‌- జేబీఎస్‌ మార్గం అందుబాటులోకి వచ్చింది. మిగిలిన 5.5 కిలోమీటర్ల మార్గాన్ని తక్షణమే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ కోరారని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారాన్ని అందిస్తామని ఎల్‌ అండ్‌ టీ సంస్థకు హామీ ఇచ్చారని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

ఇక కేటీఆర్‌ ట్వీట్‌కు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. మంత్రి కేటీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని, పాత బస్తీ ప్రజలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారన్నారు. ఈ నిర్ణయం పాతబస్తీ వాసులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే టూరిజం పరంగా కూడా ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని ఓవైసీ రిప్లై ఇచ్చారు. కాగా ఈ మార్గంలో నాలుగు స్టేషన్లను ప్రతిపాదించారు. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, శంషీర్‌గంజ్‌ వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2వేల కోట్లు ఖర్చవుతుందని గతంలోనే అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..