AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR Birthday: సార్ బర్త్ డే పుణ్యం.. ఆ పేద ఇళ్లల్లో చాన్నాళ్లకు టమాట కూర ఉడికింది

 పుర్రెకో గుణం.. జిమ్మకో రుచి అంటారు.. వెరైటీ కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత... KTR జన్మదినం సందర్భంగా వరంగల్ లో ఓ BRS నాయకుడు పేదలకు ఊహించని కానుక ఇచ్చాడు.. ఆ ఎర్రని కానుక ఇప్పుడు ఓరుగల్లులో హాట్ టాపిక్ అయ్యింది.. ఇంతకీ ఏంటా కనుక..? ఎందుకు చర్చగా మారిందో తెలుసుకుందాం పదండి

KTR Birthday: సార్ బర్త్ డే పుణ్యం.. ఆ పేద ఇళ్లల్లో చాన్నాళ్లకు టమాట కూర ఉడికింది
Free Tomato
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jul 24, 2023 | 11:02 AM

Share

వరంగల్, జులై 24: అమాంతం పెరిగిన టమాట ధరలు పేదలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. అందుకే పూర్ పీపుల్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్లు టమాట కొనేందుకు సాహసించడం లేదు. ఇప్పుడు ఎక్కడు చూసినా ట్రెండింగ్ టాపిక్ టమాటానే. టమాట చోరీలు, టమాట పంటతో కోటీశ్వర్లు అయిన రైతులు ఇలాంటి వార్తలు రీసెంట్ టైమ్స్‌లో వింటూనే ఉన్నాం.  తాజాగా అలాంటి ఓ సమ్ థింగ్ స్పెషల్ న్యూస్ మీ ముందుకు తెచ్చాం. డైనమిక్ పొలిటిషియన్.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR బర్త్ డే నేడు. ఈ క్రమంలో వేడుకలు అందరిలా సాదాసీదాగా చేస్తే ఏం బాగుంటుంది.. ఏదో ఓ ప్రత్యేక ఉంటేనే కిక్కు అని భావించిన ఈ BRS నాయకుడు డిఫరెంట్‌గా KTR జన్మిదిన వేడుకలు నిర్వహించారు. పేదలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేసి చూపరులను అవాక్కయ్యేలా చేశాడు.

ఈ వినూత్న జన్మదిన కానుకల పంపిణీ వరంగల్‌లో జరిగింది. రాజనాల శ్రీహరి అనే BRS నాయకుడు వరంగల్ చౌరస్తాలో  KఒR జన్మదిన వేడుకలు నిర్వహించారు.. రెండు వందల మంది పేదలకు ఇలా గులాబీ రంగు బుట్టలో టమాటాలు ఉచితంగా పంపిణీ చేశాడు.  ఈ వినూత్న కానుక వరంగల్‌లో హాట్ టాపిక్ గా మారింది ఉచిత టమాటల పంపిణీ చూసి చిన్న సార్ కళ్లలో పడేందుకు భలే ప్లాన్ వేశావు సోదరా అని  కామెంట్స్ చేస్తున్నారు.

BRS పార్టీ ఆవిర్భావం రోజు లిక్కర్, చికెన్ పంపిణీ చేసి ఆ రోజు చర్చగా నిలిచిన రాజనాల శ్రీహరి.. తాజాగా టమాటాల పంపిణీతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us