Telangana: హైదరాబాద్‌లో త్వరలోనే మొబైల్ కంట్రోల్ రూం..
హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్ని చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల చెట్లు నెలకూలుతున్నాయి. ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. మరికొన్ని చోట్ల అగ్నిప్రమదాలు కూడా జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలన్ని చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల చెట్లు నెలకూలుతున్నాయి. ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. మరికొన్ని చోట్ల అగ్నిప్రమదాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ ప్రమాదాలు తీవ్రస్థాయిలో ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలల్సి ఉంటుంది. అందుకోసం పలు ప్రభుత్వ విభాగాలు సమన్వయం అవసరం అవుతుంది. ఒకవేళ ప్రమాద స్థలంలోనే కంట్రోల్ రూం ఉంటే రెస్యూ ఆపరేషన్ చేసేందుకు మరింత సులభతరం అవుతుంది.
అందుకోసమే మెబైల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎంలోని డీఆర్‌ఎఫ్ విభాగం సిద్ధమౌతోంది. కంట్రల్ రూంకు సంబంధించి అవసరమైన వాహన కొనుగోలుకు జీహెచ్‌ఎంసీ టెండర్లకు కూడా పిలిచింది. ఆన్ – సీన్ కమాండ్, కమ్యూనికేషన్, కోఆర్డినేషన్ సెంటర్‌గా పనిచేసేందుకు ఈ వాహనంలో ఆధునిక పరికరాలు, వర్క్ స్టేషన్ వంటివి అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులతో సమావేశమై తక్షణమే నిర్ణయాలు తీసుకొని అమలు చేసేందుకు వీలవుతుంది. ఒకవేళ ప్రమాదం జరిగిన చోట అక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉంటే కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..