Hyderabad: వెయ్యేళ్లనాటి అరుదైన టేకు దుంగతో చెక్కిన శ్రీ మహా విష్ణు శిల్పం.. చూసేందుకు క్యూ కడుతున్న పర్యాటకులు

పురాతన వస్తువులు, విగ్రహాలు బయటపడితే అందరికి అది ఒక అద్బుతంలాగే కనిపిస్తుంది. అయితే హైదరాబాద్‌లోని దాదాపు వెయ్యేళ్ల నాటి టేకు దుంగలతో ఆదిశేష శయన శ్రీ మహా విష్ణు శిల్పాన్ని రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Hyderabad: వెయ్యేళ్లనాటి అరుదైన టేకు దుంగతో చెక్కిన శ్రీ మహా విష్ణు శిల్పం.. చూసేందుకు క్యూ కడుతున్న పర్యాటకులు
Ananta Seshasayana Sri Maha Vishnu
Follow us
Aravind B

|

Updated on: Jul 24, 2023 | 2:05 PM

పురాతన వస్తువులు, విగ్రహాలు బయటపడితే అందరికి అది ఒక అద్బుతంలాగే కనిపిస్తుంది. అయితే హైదరాబాద్‌లోని దాదాపు వెయ్యేళ్ల నాటి టేకు దుంగతో అనంత ఆదిశేష సాయన శ్రీ మహా విష్ణు శిల్పాన్ని రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చాలామంది పర్యాటకులు, కళా ప్రేమికులు ఈ కళాఖండాన్ని చూసేందుకు పోటెత్తుతున్నారు. ఎంతో అరుదైన టేకు దుంగతో చెక్కిన శిల్పాన్ని చూస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. అయితే వంద సంవత్సరాల చరిత్ర గలిగిన ఓ ప్రముఖ కంపెనీకి ఈ శిల్పాన్ని చెక్కే బాధ్యతలను అప్పగించడం విశేషం. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం నాలుగు తరాలుగా ఈ కలప వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే దేశంలోని కలపతో వ్యాపారం చేస్తున్న అతిపెద్ద కంపెనీ కూడా ఇదే.

అంతేకాదు ఈ కంపెనీ ప్రముఖ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి కూడా తమ సహకారాన్ని అందించింది. ఆలయ ప్రధాన ద్వారాలను తయారుచేయడంలో అలాగే చెక్క పనులను అందించిండంలో తోడ్పడింది. నూతనంగా నిర్మించిన భారత పార్లమెంట్‌ నిర్మాణంలో కూడా ఈ కంపెనీ గణనీయమైన కృషి చేసింది. అంతేకాదు అయోధ్యలోని రామ జన్మభూమి ఆలయ పనులకు సంబంధించిన బాధ్యతలను కూడా ఈ ప్రతిష్ఠాత్మక కంపెనీకే అందించడం మరో విశేషం.

ఈ సంస్థకు భాగస్వామిగా ఉన్న శరత్ బాబు అనే వ్యక్తి మహా విష్ణువు శిల్పాన్ని చెక్కించి తమ కళను సాకారం చేసుకున్నారు. పురాతనమైన, అరుదైన ఈ చెక్క దుంగను చూసినప్పుడు దీన్ని కేవలం డోర్లు, కిటికీల తయారీకి వినియోగించకూడదని అనుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తు తరాలు ఇలాంటి అద్భుతాన్ని చూడలేకపోతాయని.. అందుకోసమే దీన్ని భద్రపరచాలనుకున్నానని.. చివరికి మహా విష్ణు శిల్పాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ వేలంలో ఈ చెక్క దుంగను సొంతం చేసుకున్నాక.. మయన్మార్‌లోనే మహావిష్ణువు శిల్పాన్ని చెక్కే పనులు కొంతవరకు జరిగాయని.. మళ్లీ ఇండియాకి తీసుకొచ్చిన తర్వాతే పనులు మొత్తం పూర్తయ్యాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..