Telangana: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే ఉచిత రేషన్..
ఉచిత ఆహార పథకాన్ని పొడిగిస్తున్నామని మార్చి 28న కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్, మే నెలల్లో సాంకేతిక కారణాలతో ఉచిత బియ్యాన్ని అందించలేకపోయాయని మంత్రి గంగుల అన్నారు. ఈ నెలలో 18 నుంచి 26 వరకు ఉచిత రేషన్ బియ్యాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
Ration Rice In Telangana: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల నుంచే ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉచిత బియ్యాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, కేంద్రం ఇచ్చే 5 కేజీల ఉచిత బియ్యానికితోడు మరో 5 కేజీలు అంటే మొత్తం ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున రేషన్ అందిస్తామని ఆయన తెలిపారు. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 10 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. సాధారణంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తుండగా.. జూన్ నెల నుంచి డిసెంబర్ వరకు 10 కిలోలు ఇవ్వనున్నారు.
కాగా, ఉచిత ఆహార పథకాన్ని పొడిగిస్తున్నామని మార్చి 28న కేంద్రం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఏప్రిల్, మే నెలల్లో సాంకేతిక కారణాలతో ఉచిత బియ్యాన్ని అందించలేకపోయామని మంత్రి గంగుల అన్నారు. ఈ నెలలో 18 నుంచి 26 వరకు ఉచిత రేషన్ అందిస్తామని ఆయన పేర్కొన్నారు.