AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఢిల్లీలో నా సీటు లాగేసుకున్నారు!.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చిరంజీవి చమత్కారం..

Telangana: కేంద్ర మాజీ మంత్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.

Telangana: ఢిల్లీలో నా సీటు లాగేసుకున్నారు!.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చిరంజీవి చమత్కారం..
Kishan Reddy
Shiva Prajapati
|

Updated on: Apr 02, 2022 | 9:45 PM

Share

Telangana: కేంద్ర మాజీ మంత్రి, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘అసెంబ్లీలో కూర్చునే కిషన్ రెడ్డి.. ఢిల్లీలో నా సీటు నుంచి నన్ను తప్పించి ఆయన కూర్చున్నారు.’’ అంటూ చమత్కరించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవం జరిగింది. ఉగాది సందర్భంగా, రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ రావు మెగావల్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. తన చమత్కారాలతో వేదికపై నవ్వులు పూయించారు. సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. త్రిబుల్ ‘సి’ ఫార్ములాతో కల్చర్, క్రాఫ్ట్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు చిరంజీవి. భారతీయత తత్వం పటిష్టం చేయడానికి ఉత్సవాలు ఎంతో కృషి చేస్తాయని అన్నారు. ప్రాంతీయ సినిమాల మధ్య తెలుగు సినిమా హద్దులు చేరిపేసిందని చిరంజీవి పేర్కొన్నారు. బాహుబలి నుంచి త్రిబుల్ ఆర్ వరకు అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని స్వయంగా మోడీ చెప్పారని చిరంజీవి ఉటంకించారు.

కాగా, ఎన్టీఆర్ స్టేడియంలో రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఉగాది సందర్భంగా, రెండో రోజు జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కల్చరల్ ఫెస్టివల్‌లో వృత్తులను నమ్ముకుని ఉన్నవాళ్లనే పిలిచామని, ప్రొఫెషనల్స్‌ని పిలువ లేదని చెప్పారు. కళాకారులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని చెప్పారు. ఇది ప్రభుత్వ పండగ కాదని, ప్రజల పండుగ అని చెప్పారు. 75 దేశాల్లో పర్యటక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. ఆగస్టు15వ తేదీన ప్రతి భారతీయుడి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

Also read:

Viral News: హెల్పింగ్ క్యాట్.. ఫండ్ రైజింగ్‌లో టాప్.. ఎంత డబ్బు వసూలు చేసిందో తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..!

Pakistan Politics: పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఉన్నట్లా? లేనట్లా? పాకిస్తాన్ రాజకీయ చరిత్ర మొత్తం డిఫరెంటే..!

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి..