Viral News: హెల్పింగ్ క్యాట్.. ఫండ్ రైజింగ్‌లో టాప్.. ఎంత డబ్బు వసూలు చేసిందో తెలిస్తే ఫ్యూజుల్ ఔట్..!
Viral News: రష్యా-ఉక్రెయిన్ వార్ ప్రభావం ఆ రెండు దేశాలపైనే కాదు.. యావత్ ప్రపంచ దేశాలపైనా ప్రభావం చూపుతోంది. ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ దేశాలు..
Viral News: రష్యా-ఉక్రెయిన్ వార్ ప్రభావం ఆ రెండు దేశాలపైనే కాదు.. యావత్ ప్రపంచ దేశాలపైనా ప్రభావం చూపుతోంది. ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇక ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌లో సామాన్య ప్రజలతో పాటు, మూగ జీవాలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇది బాధాకరమైన వార్తలు సోషల్ మీడియాలో, ప్రసార సాదనాల్లో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంక్షోభంలోనూ.. చాలా మంది తమ పెంపుడు జంతువులను వదులుకోవడానికి ఇష్టపడలేదు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. వాటితోనే ఉండిపోతున్నారు. అయితే, యుద్ధం కారణంగా ప్రజలకే సరైన ఆహారం, నీరు అందట్లేదు. ఇక మూగ జీవాల పరిస్థితి దారుణం అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే.. మూగ జీవుల సంరక్షణ కోసం విరాళాలు సేకరించడం ప్రారంభించారు.. వాటి నిర్వాహకులు. వచ్చే విరాళాలతో మూగ జీవాలకు సాయం చేస్తున్నారు.
అయితే, ఈ మధ్య ఒక పిల్లి తన తోటి మూగ జీవాలను రక్షించుకునేందుకు విరాళాలు సేకరిస్తోంది. వినూత్న రీతిలో సోషల్ మీడియా వేదికగా ఫండ్ రైజింగ్ చేస్తోంది. పిల్లి ఏంటి ఫండ్ రైజింగ్ చేయడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇది నిజంగా నిజమే. అయితే పిల్లి పేరుతో జంతు ప్రేమికులు ఈ ఫండ్ రైజింగ్ చేస్తున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల కారణంగా అక్కడ పరిస్థితులు దారుణంగా మారాయి. మనుషులకే తినడానికి తిండి, తాగడానికి నీళ్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మూగ జీవాలను ఆదుకునేందుకు జంతు ప్రేమికులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే.. పిల్లి పేరుతో విరాళాలు సేకరిస్తున్నారు. స్టీఫెన్ పేరుతో ఇన్‌స్టాగ్రమ్, ట్విట్టర్‌లో అకౌంట్ ఓపెన్ చేసి.. వైన్ గ్లాస్ పక్కన కూర్చున్న పిల్లి బొమ్మను డీపీగా పెట్టారు. మూగ జీవాల కోసం అంటూ ఫండ్ రైజింగ్ మొదలు పెట్టారు. రూ. 12 లక్షలకు పైగా యూజర్లు దీనికి ఫాలోవర్స్ ఉండటం విశేషం.
Je crois que Stepan est désormais en sécurité en France https://t.co/GaLj39SycY
— The girl on the hill (@lebret_tamara) April 1, 2022
మరో విశేషం ఏంటంటే.. ఉక్రెయిన్‌లో ఇబ్బందులు పడుతున్న మూగ జీవాలకు సాయం అందించేందుకు సోషల్ మీడియా వేదికగా ఈ పిల్లి రూ. 7.5 లక్షలకు పైగా విరాళాలు సేకరించింది. విరాళాల ద్వారా వచ్చిన సొమ్మునంతా అవసరమైన జంతువుల సంరక్షణకు ఇవ్వడం జరుగుతుంది. ఉక్రెయిన్‌లోని జంతు సంరక్షణ సంస్థలు, జంతు ప్రదర్శనశాలలకు కూడా ఈ నిధులు ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. వీరు చేస్తున్న ఈ ప్రయత్నం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. వీరి ప్రయత్నం వల్ల ఎన్నో మూగ జీవాలు ప్రాణాలతో ఉంటున్నాయని కితాబిస్తున్నారు.
View this post on Instagram
Also read:
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ వ్యాన్.. 11 మంది మృతి..
Farmer Innovation: రైతన్నకు హ్యాట్సాఫ్.. పోలీస్ సైరన్‌ను ఎలా వాడేశాడో చూడండి..!
AP Weather Alert: ఏపీలో మరో మూడు రోజులు ఎండలు.. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు వార్నింగ్..!