Boora Narsaiah Goud: టీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలోకి బూర నర్సయ్యగౌడ్..!
తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ ఎన్నిక వేళ రాజకీయాలు మరింతగా ఆసక్తికరంగా మారుతున్నాయి. నువ్వా.. నేనా .. అన్నట్లు కొనసాగుతోంది. తాజాగా..

తెలంగాణలో మునుగోడు అసెంబ్లీ ఎన్నిక వేళ రాజకీయాలు మరింతగా ఆసక్తికరంగా మారుతున్నాయి. నువ్వా.. నేనా .. అన్నట్లు కొనసాగుతోంది. తాజాగా టీఆర్‌ఎస్ మరో షాక్ తగలనుంది. టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ష్ట్ర సమితికి గుడ్‌బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భేటీ అనంతరం బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు బీజేపీ నేత తరుణ్ చుగ్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన సంకేతాలిచ్చారు. నిన్న తరుణ్‌చుగ్, బండి సంజయ్‌తో బూర నర్సయ్య గౌడ్ భేటీ అయ్యారు.
అయితే నర్సయ్యగౌడ్ మునుగోడు టికెట్ ఆశించారు. ఆయనకు టికెట్ దక్కపోవడంతో బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. నిన్న కూసుకుంట్ల నామినేషన్ పూర్తయిన తర్వాత బీజేపీ నేతలను బూర నర్సయ్యగౌడ్ కలిశారు.
