AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హారీష్ రావు. మెదక్‎లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బిఆర్ఎస్ మెజారిటీ సాధించిందని గుర్తు చేశారు. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బిఆర్ఎస్ మెజారిటీ సాధించిందన్నారు.

Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌ రావు కౌంటర్.. ఏమన్నారంటే..
Former Minister Harish Rao
P Shivteja
| Edited By: |

Updated on: Jun 27, 2024 | 9:00 PM

Share

పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హారీష్ రావు. మెదక్‎లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సీఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే అందులో మూడు చోట్ల బిఆర్ఎస్ మెజారిటీ సాధించిందని గుర్తు చేశారు. రఘునందన్ రావు సొంత నియోజకవర్గం దుబ్బాకలో కూడా బిఆర్ఎస్ మెజారిటీ సాధించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది అని, అక్కడ బిజెపీకి కాంగ్రెస్ ఓట్లు ఆయనే మళ్లించారా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన మహబూబ్‎నగర్‎లో బిజెపి ఎలా గెలిచిందని అడిగారు. మహబూబ్‎నగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారని.. వారంతా కలిసి బిజెపిని గెలిపించారా? అని నిలదీశారు.

ఇక కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి 32 వేల మెజారిటీతో గెలిచారని.. పార్లమెంటు ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థికి 21 వేల మెజారిటీ మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. మిగతా ఓట్లను రేవంత్ రెడ్డి బిజెపికి వేయించారా? అని ప్రశ్నలు సంధించారు. ఇక అలాగే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మల్కాజిగిరిలో బిజెపి భారీ మెజారిటీతో ఎలా గెలిచిందని అడిగారు. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ బిజెపిని గెలిపించిందా? సమాధానం చెప్పాలన్నారు. బిజెపి పంచన చేరింది, మోడీ శరణు చొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి అని ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి బిజెపి ఎజెండా అమలు చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. నిండు సభలో ప్రధాని మోడీని పెద్దన్న అని సంబోధించింది ఎవరు అని అడిగారు. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై సింగరేణని ప్రైవేటు పరం చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. విభజన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడం లేదన్నారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ శక్తి అయిన బిఆర్ఎస్‎ను టార్గెట్ చేశాయన్నారు. బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!