రైతులకు దడ పుట్టిస్తున్న బెబ్బులి.. పది గ్రామాల ప్రజల్లో భయాందోళన

పది గ్రామాల ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్న పులిని ట్రాక్ చేస్తున్న ఫారెస్ట్‌ సిబ్బంది. మహారాష్ట్ర సరిహద్దు దాటేవరకు రక్షణ చర్యలు చేపట్టారు.

రైతులకు దడ పుట్టిస్తున్న బెబ్బులి.. పది గ్రామాల ప్రజల్లో భయాందోళన
A Tiger In Nirmal
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 10, 2024 | 8:07 AM

నిర్మల్ జిల్లా ప్రజల గుండెల్లో పులి సంచారం దడ పుట్టిస్తుంది. కొంతకాలంగా బెబ్బులి అలికిడి లేక స్తబ్ధుగా ఉన్న పల్లెలు మళ్లీ ఉలిక్కిపడ్డాయి. దీంతో పులి అడుగు జాడలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఫారెస్ట్‌ సిబ్బంది.

పెద్దపులి పేరు వింటే చాలు నిర్మల్‌ జిల్లా ప్రజలు హడలిపోతున్నారు. పది రోజులుగా పది గ్రామాల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన బెబ్బులి సరిహద్దు దాటినట్టే దాటి మళ్లీ తిరిగొచ్చింది. సారంగపూర్, నర్సపూర్, కుంటాల మండలాల ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. పశువుల మంద మీద దాడి చేసి మూడు పశువులను హతమార్చింది. పులి దాడి నేపథ్యంలో అలర్ట్ అయిన అటవిశాఖ ట్రాప్ కెమెరాలతో నిఘా పెంచింది‌.

అయితే, ఎప్పుడు ఎటు వైపు నుంచి వచ్చి దాడి‌ చేస్తుందో తెలియక పశువుల కాపారులు రైతులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వలస వచ్చిన పులిని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు అటవీ శాఖ చెమటోడుస్తోంది. ఈ బెబ్బులి వయస్సు 6 ఏళ్ల పైగానే ఉంటుందని.. మహారాష్ట్రాలోని పెనుగంగా టైగర్ జోన్ లో సంచరించే జాని టైగర్ గా గుర్తించామని తెలిపారు బైంసాఎఫ్ఆర్వో వేణుగోపాల్. మహారాష్ట్ర అటవీ శాఖ అధికారుల సహాకారంతో పులిని ట్రాక్ చేస్తున్నామన్నారు.

జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి మహారాష్ట్ర సరిహద్దు దాటేవరకు రక్షణ చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్ఆర్వో వేణుగోపాల్ తెలిపారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు ఉదయం 9 గంటలకు వెళ్లి 4 గంటలలోపు పనులు ముగించుకోవాలని సూచించారు. కర్రకు గజ్జెలు కట్టి శబ్దం, అరుపులు చేస్తూ వెళ్లాలని సూచించారు. అటవీ ప్రాంతానికి అరకిలోమీటర్ మించి వెళ్లరాదని, పంటల రక్షణకు కంచెలు ఏర్పాటు చేయవద్దని దండోరా చాటింపు వేస్తూ పులి సంచార గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. పులి ఉంటేనే అడవి క్షేమంగా ఉంటుందని.. పర్యావరణ సమతుల్యత కొనసాగుతుందని.. అడవి పందుల బెడద రైతులకు తప్పుతుందంటున్నారు అటవి అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!