Telangana: హడలెత్తిస్తున్న మ్యాన్ ఈటర్.. కొమురంభీం జిల్లాలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..

పులుల సంచారంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ చోట కనిపిస్తూ స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

Telangana: హడలెత్తిస్తున్న మ్యాన్ ఈటర్.. కొమురంభీం జిల్లాలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..
Tiger (File Photo)
Follow us

|

Updated on: Nov 20, 2022 | 9:27 AM

పులుల సంచారంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ చోట కనిపిస్తూ స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఏపీలోని విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్‌, కొమ్రంభీం జిల్లాల్లో పులుల సంచారంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా భూపాలపట్నం దగ్గర పెద్దపులి గొర్రెలమందపై దాడి చేసింది. దీంతో తమపై ఎక్కడ దాడి చేస్తుందోనని గ్రామస్థుల్లో భయాందోళన పెరిగింది. కాగజ్‌నగర్‌లో పులిభయం నుంచి బయటపడకముందే.. ఏపీలోని నంద్యాల జిల్లాలో చిరుతపులి సంచారం స్థానికులను బెంబేలెత్తిస్తోంది. చిరుతపులి సంచారంపై స్థానికుల సమాచారంతో ఫారెస్ట్‌ అధికారులు రంగంలోకి దిగారు. పాములపాడు మండలం ఎర్రగూడూరు పంటపొలాల్లో చిరుత పాదముద్రలను పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మ్యాన్ ఈటర్ కోసం కొనసాగుతున్న వేట..

గత కొద్ది రోజులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మ్యాన్ ఈటర్ కోసం ఫారెస్ట్ అధికారుల వేట కొనసాగుతోంది. మొత్త ఎనిమిది బృందాలతో, మూడు రేంజ్‌ల పరిధిలో పులి కోసం గాలింపు చేపట్టారు అధికారులు. సిర్పూర్ టి మండలం, భూపాలపట్పం శివారులో పులి సంచరిస్తున్నట్లు గుర్తించారు. కాగా, ఆకలి మీదున్న పులి.. శనివారం సాయంత్రం భూపాలపట్నం శివారులో గొర్రెల మందపై దాడి చేసింది. ఓ గొర్రెను చంపి తినేసింది.

అయితే, ఆహారం కోసం తిరిగి ఇదే ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. 52 ట్రాప్ కెమెరాలు , 40 మంది అటవి శాఖ సిబ్బంది , 22 మంది టైగర్ ట్రాకర్లతో పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం