Telangana: షాకింగ్.. ఆ హోటల్‌లో వేడివేడిగా బూజుపట్టిన చికెన్.. పురుగుల పడిన రొయ్యలు
రోజుల తరబడి నిల్వ ఉంచిన, పురుగులు, బూజుపట్టిన మాంసం వండి పెడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ హోటల్ యజమాని.
రోజుల తరబడి నిల్వ ఉంచిన, పురుగులు, బూజుపట్టిన మాంసం వండి పెడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు ఓ హోటల్ యజమాని. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బండ్లగూడజాగీర్ నగరపాలక సంస్థ పరిధిలో వెలుగు చూసింది. బండ్లగూడజాగీర్ కూడలిలోని పెట్రోలు బంకు పక్కన గల ఓ రెస్టారెంట్‌లో అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫ్రిజ్‌లో బూజుపట్టిన మాంసం, పురుగులు పట్టిన చికెన్ దర్శనమిచ్చాయి. రెండు రోజుల కిందటి బిర్యానీని తిరిగి వేడి చేసి పెడుతున్నట్లు గుర్తించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ గౌరిశెట్టి మనోహర్ వాటిని… నాణ్యత పరిశీలన కోసం సేకరించారు. హోటల్ నిర్వాహకుడిపై అక్కడికక్కడే 5వేల రూపాయలు జరిమానా వేసి వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్‌లో కల్తీ మాంసం విక్రయాలపై బల్దియా దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీ స్టాంప్ వేసిన మాంసాన్నే కొనుగోలు చేయాలని నగర పౌరులకు అధికారులు సూచించారు. ఇటీవల గ్రేటర్ వెటర్నరీ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూసిన నేపథ్యంలో నగర పౌరులను అధికారులు అలర్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలో వేలాదిగా మాంసం దుకాణాలు నడుస్తున్నాయని గుర్తించిన అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల పలు షాపులపై దాడులు చేసిన అధికారులు.. ఆ దాడుల్లో పాడైన, కల్తీ మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: చేపను కొని.. కట్ చేసి.. లోపల చూడగానే కంగుతిన్నారు…