Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GHMC: గ్రేటర్ వాసులకు గుడ్‌న్యూస్.. దోమల విముక్తి డ్రోన్లతో యుద్ధం.. జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చకోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది. ఇదే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

GHMC: గ్రేటర్ వాసులకు గుడ్‌న్యూస్.. దోమల విముక్తి డ్రోన్లతో యుద్ధం.. జీహెచ్ఎంసీ వినూత్న కార్యక్రమం
Ghmc Drone
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 11, 2021 | 8:05 PM

GHMC Initiative Programe to check for Mosquitoes: సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చకోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తోంది. ఇదే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నగర ప్రజలకు దోమల బెడద నుండి విముక్తితో పాటు దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకు జీహెచ్ఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్యాన్ని అంధించి, తద్వారా జీవన ప్రమాణాల మెరుగుకు దోహదపడే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మహానగర పరిధిలోగల చెరువులు, కుంటలు, నీటి నిలువ ప్రదేశాలలో దోమలను నియంత్రించడానికి సమగ్ర విధానాన్ని అనుసరిస్తూ దోమల లార్వాలను నియంత్రించుటకు డ్రోన్లను వినియోగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.

ఇందులో భాగంగా చెరువులో ఉండే గుర్రపు డెక్కను తొలగించడంతో పాటు దోమల పెరుగుదలను నియంత్రించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. నీటితో నిండిన ప్రదేశాలు, వృక్షసంపద, సేంద్రియ వ్యర్ధాలు ఉన్న చెరువులలో మన్సోనియా, అర్మిజెరిస్, క్యూలెక్స్ వంటి ఇబ్బంది కలిగించే దోమలను లార్వా దశలోనే నియంత్రించడానికి డ్రోన్ల సహాయంతో దాడి చేయడం ముఖ్య ఉద్దేశ్యమని జీహెచ్ఎంసి ఎంటమాలాజి శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే ఫీల్డ్ వర్కర్ల సహాయంతో చెరువుల పై భౌతికంగా రసాయనాలను నేషనల్ వెక్టర్ బోర్న్ డీజీసెస్ కంట్రోల్ ఢిల్లీ వారిచే నిర్ణయంచబడిన మోతాదులో పిచికారి చేయడం జరుగుతోందని అధికారులు తెలిపారు. చెరువుల నుండి దోమల బెడద సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని లక్ష్యాన్ని చేరేందుకు జీహెచ్ఎంసీ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో మురుగు నీరు ఎక్కువ నిలిచే చెరువులను మొదటి విడతగా ఎంపిక చేసి దోమల నివారణకు డ్రోన్లను వినియోగించుకోవడం జరుగుతోంది.

Ghmc Drones

Ghmc Drones

నగరంలో మొదటగా 30 చెరువులలో డ్రోన్ల ద్వారా దోమల నివారణకు వాడే రసాయనాన్ని పిచికారి చేయడం జరగుతుందని జీహెచ్ఎంసీ ఎంటమాలాజీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఒప్పందం చేసుకొని నెలకు రెండుసార్లు, అవసరమైనచోట మూడు సార్లు కూడా పిచికారి చేయడం జరుగుతుందన్నారు.

డ్రోన్ల వల్ల ప్రయోజనాలు

  • సమయం ఆదా, ఎకరం చెరువును కేవలం 10 నిమిషాల్లో పిచికారి చేయవచ్చు.
  • చెరువులోని అన్ని భాగాలకు సులువుగా చేరడం.
  • చెరువు అంతటా ఏకరితీన పిచికారితో పాటు సమయం, ఖర్చు ఆదా.
  • జీహెచ్ఎంసీ పరిధిలో ఆరు జోన్లలో ప్రతి జోన్‌కు ఒక్కటి చొప్పున మొత్తం 6 హెక్సకాప్టర్ డ్రోన్లు.
  • ప్రస్తుతం 30 చెరువులకు ఒప్పందం.
  • మరో 20 చెరువులలో దోమల నివారణకు చర్యలు.
  • చెరువులు, కుంటలు కాలనీలు, క్వారీలు, ఓపెన్ ప్లాట్లు, డంపింగ్ యార్డు, మూసినది పరివాహక ప్రాంతాల్లో డ్రోన్ ల ద్వారా రసాయనాల పిచికారి.
  • రసాయనాల పిచికారి ద్వారా దోమల లార్వా, పెద్ద దోమల నియంత్రణ.

Read Also…  Japanese Train: రైలును నిమిషం ఆలస్యంగా నడిపినందుకు డ్రైవర్‌కు ఫైన్.. న్యాయం జరిగేవరకూ పోరాడతా అంటున్న రైల్వే డ్రైవర్..