ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన 35మంది విద్యార్థినులు

హైదరాబాద్ శాలిబండ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. 35 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురికావడంతో వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారు 5, 6 తరగతులు చదువుతున్నారు. చికెన్, ఆ తర్వాత మైసూర్ బోండా తినడం వల్ల అస్వస్థతకు గురైనట్లు చెప్తున్నారు. ఒక్కొక్కరికి కడుపు నొప్పి, వాంతులు కావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు సిబ్బంది. ఫుడ్ పాయిజన్‌కు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు ఉన్నతాధికారులు. సిబ్బంది నిర్లక్ష్యమా.. […]

ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన 35మంది విద్యార్థినులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 15, 2019 | 11:37 AM

హైదరాబాద్ శాలిబండ తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురయ్యారు. 35 మంది స్టూడెంట్స్ అస్వస్థతకు గురికావడంతో వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అస్వస్థతకు గురైన వారు 5, 6 తరగతులు చదువుతున్నారు.

చికెన్, ఆ తర్వాత మైసూర్ బోండా తినడం వల్ల అస్వస్థతకు గురైనట్లు చెప్తున్నారు. ఒక్కొక్కరికి కడుపు నొప్పి, వాంతులు కావడంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు సిబ్బంది. ఫుడ్ పాయిజన్‌కు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు ఉన్నతాధికారులు. సిబ్బంది నిర్లక్ష్యమా.. మరేదైనా కారణం ఉందా ఉన్న కోణంలో విచారిస్తున్నారు.