నగరంలో రెండు రోజులపాటు ఉపరాష్ట్రపతి పర్యటన
హైదరాబాద్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమీషనర్ అనిల్ కుమార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉపరాష్ట్రపతి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్తారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తార్నాకలోని సరోజిని నాయుడు వనిత ఫార్మసీ మహా విద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరిగి అక్కడి […]
హైదరాబాద్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమీషనర్ అనిల్ కుమార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉపరాష్ట్రపతి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్తారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తార్నాకలోని సరోజిని నాయుడు వనిత ఫార్మసీ మహా విద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. తిరిగి అక్కడి నుంచి 11గంటలకు జూబ్లీహిల్స్‌లోని ఇంటికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు/వాహనాలను నిలిపివేస్తామని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అనిల్‌కుమార్ కోరారు.