అమీర్‌పేట్‌-హైటెక్‌ సిటీ మెట్రో రూట్‌కి గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్‌:హైదరబాద్ వాసులు ఎంతోగానో ఎదురు చూస్తున్న అత్యంత కీలకమైన అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో రూట్ ప్రారంభానికి మూహుర్తం కుదిరింది. వచ్చేవారం నుంచి ఈ రూట్‌లో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రద్ధీ ఎక్కువగా ఉండే ఈ మార్గంలో ఇంక ప్రయాణం సులభతరం కానుంది. పవర్ సప్లయ్, కమ్యూనికేషన్ సిస్టమ్,సిగ్నలింగ్ సిస్టమ్స్‌ను మెట్రో ఇంజనీర్స్‌తో కలిసి అధికారులు తనిఖీ చేశారు.అన్ని సక్రమంగా ఉండటంతో ఈ మార్గంలో రైళ్లు నడపడానికి కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) తాజాగా […]

అమీర్‌పేట్‌-హైటెక్‌ సిటీ మెట్రో రూట్‌కి గ్రీన్ సిగ్నల్
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 16, 2019 | 8:03 AM

హైదరాబాద్‌:హైదరబాద్ వాసులు ఎంతోగానో ఎదురు చూస్తున్న అత్యంత కీలకమైన అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మెట్రో రూట్ ప్రారంభానికి మూహుర్తం కుదిరింది. వచ్చేవారం నుంచి ఈ రూట్‌లో మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రద్ధీ ఎక్కువగా ఉండే ఈ మార్గంలో ఇంక ప్రయాణం సులభతరం కానుంది. పవర్ సప్లయ్, కమ్యూనికేషన్ సిస్టమ్,సిగ్నలింగ్ సిస్టమ్స్‌ను మెట్రో ఇంజనీర్స్‌తో కలిసి అధికారులు తనిఖీ చేశారు.అన్ని సక్రమంగా ఉండటంతో ఈ మార్గంలో రైళ్లు నడపడానికి కమిషనర్‌ ఆఫ్‌ మెట్రో రైల్‌ సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్‌) తాజాగా అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్‌ అమల్లో ఉన్నందున ఎటువంటి హడావిడి, ప్రచార కార్యక్రమాలు లేకుండా ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు నిర్ణయించారు.

ఈ కారిడార్‌లో మెట్రో రైళ్లు నడపడానికి గత నవంబరు నాటికే నిర్మాణాలు పూర్తయ్యాయి.గత నాలుగు నెలలుగా ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్న అధికారులు… ప్రయాణికుల కోసం రైళ్లు నడపడానికి సీఎంఆర్‌ఎస్‌ అనుమతి తప్పనిసరి కావడంతో ఇంతకాలం వేచి చూశారు. తాజాగా అనుమతి రావడంతో ఈ మార్గంలో ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. దీంతో రానున్న కొద్దిరోజుల్లోనే హైటెక్‌ సిటీ మార్గంలో రైలు సేవలను అందుబాటులోకి తేవాలని మెట్రో రైలు అధికారులు తుది ఏర్పాట్లు చేస్తున్నారు. మాదాపూర్‌, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఇతర కార్పోరేట్ ఎంప్లాయిస్‌కు చాలా వరకు ట్రాపిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ రూట్‌లో అమీర్‌పేట్‌, మధురానగర్‌, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌రోడ్‌ నంబర్‌-5, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ స్టేషన్‌లుంటాయి. ఈ మార్గం కూడా కలుపుకుంటే ఇప్పుడు హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో సేవలు అందుతాయి.ఇప్పటికే 29 కిలోమీటర్ల మియాపూర్‌-ఎల్‌బీనగర్‌ లైను, 17 కిలోమీటర్ల నాగోల్‌-అమీర్‌పేట్‌ లైను ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. 10 కిలోమీటర్ల అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ మార్గం మొదలవుతుడటంతో మొత్తం 56 కిలోమీటర్ల నిడివి కలిగిన మెట్రో మార్గం అందుబాటులోకి వస్తోంది.

'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..