సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో తప్పిన ట్రాఫిక్ తిప్పలు

సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. ట్రాఫిక్ తిప్పలు తప్పించింది. ఏవోసీ ప్రాంతంలో ఇక నుంచి వాహనాల రాకపోకలను రాత్రి వేళలో పునరుద్ధరించనున్నారు అధికారులు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఏవోసీలో రాత్రివేళ వాహనాల రాకపోకల్ని నిషేదించారు. ఇప్పుడు సికింద్రాబాద్, సఫిల్ గూడ, నెరేడ్‌మెట్ రూట్లలో యధావిధిగా రాకపోకలను అనుమతించారు ఆర్మీ అధికారులు. దీంతో వాహనదారులకు సమస్య తప్పింది. దీనికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ వాసులు. రాత్రి గేట్ క్లోజ్ కావడంతో తిరిగి […]

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో తప్పిన ట్రాఫిక్ తిప్పలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 15, 2019 | 5:11 PM

సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. ట్రాఫిక్ తిప్పలు తప్పించింది. ఏవోసీ ప్రాంతంలో ఇక నుంచి వాహనాల రాకపోకలను రాత్రి వేళలో పునరుద్ధరించనున్నారు అధికారులు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఏవోసీలో రాత్రివేళ వాహనాల రాకపోకల్ని నిషేదించారు. ఇప్పుడు సికింద్రాబాద్, సఫిల్ గూడ, నెరేడ్‌మెట్ రూట్లలో యధావిధిగా రాకపోకలను అనుమతించారు ఆర్మీ అధికారులు. దీంతో వాహనదారులకు సమస్య తప్పింది. దీనికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ వాసులు. రాత్రి గేట్ క్లోజ్ కావడంతో తిరిగి రావాలంటే ఇబ్బంది పడే వాళ్లమని చెప్తున్నారు.