బర్డ్ ఫ్లూ భయం.! హైదరాబాద్ జూ పార్కులో జంతువులన్నీ సేఫ్..!
వలస పక్షుల రాకతో బర్డిఫ్లూ రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. పక్షులు, జంతువులకు ఇచ్చే నీళ్లలో యాంటీ బయాటిక్స్, మల్టీ విటమిన్స్ కలిపి ఇస్తున్నారు. ప్రతి రోజూ జంతువుల గమల, మూత్ర శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నట్లు జూ అధికారులు వెల్లడించారు.
జూలాజికల్ పార్క్‌లో జంతువులను బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురిచేస్తుంది. గత నెలలలో బర్డ్ ఫ్లూ కారణంగా నాగపూర్ గోరెవాడ రెస్క్యూ సెంటర్ లో మూడు పులులు, ఓ చిరుత చనిపోవడంతో కేంద్రం అలెర్ట్ అయింది. దేశంలోని జూపార్క్ అధికారులను అలర్ట్ చేసింది.
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో జంతువులు, పక్షులకు బర్డ్ ఫ్లూ రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ 22 పులులు, 19 సింహాలు, ఆరు చిరుతలున్నాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, చిరుతలు, పక్షులు, ఇతర క్షీరదాల ఆరోగ్యం, ఆహారం, శుభ్రత విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే జూలో ఉన్న జంతువులు అన్నీ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాయని జూ పార్క్ అధికారులు తెలిపారు.
పచ్చి మాంసం, బర్డ్ ఫ్లూ సోకిన మాంసం తినడం వల్ల, వలస పక్షుల వల్ల జంతువుల్లో బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పులులు, సింహాలు, చిరుతలకు పచ్చి మాంసాన్ని ఇవ్వకుండా వేడి నీళ్లలో వేసి తీసి ఇస్తున్నట్లు తెలిపారు. పక్షుల ఎన్ క్లోజర్లను అన్ని వైపులా ఓపెన్ చేయకుండా సందర్శకులకు కనిపించేలా మాత్రమే తెరిచి పెడుతున్నారు. వలస పక్షుల రాకతో బర్డిఫ్లూ రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. పక్షులు, జంతువులకు ఇచ్చే నీళ్లలో యాంటీ బయాటిక్స్, మల్టీ విటమిన్స్ కలిపి ఇస్తున్నారు. ప్రతి రోజూ జంతువుల గమల, మూత్ర శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నట్లు జూ అధికారులు వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారం మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తామని చెప్తున్నారు. యానిమల్ కీపర్స్ కు కూడా రెగ్యూలర్ గా హెల్త్ చెకప్ లు నిర్వహిస్తున్నారు. పులులు, సింహాలు, చిరుతల ఎన్ క్లోజర్ల వద్ద ఉండే యానిమల్ కీపర్లను ఇతర ఎన్ క్లోజర్ల వద్దకు వెళ్లకుండా చూస్తున్నారు. ఎన్ క్లోజర్లకు మాస్కులు, గ్లౌజులు పెట్టుకుని వెళ్లేలా ఆదేశాలు జారీ చేశారు. శానిటైజర్లు తప్పకుండా ఉపయోగించాలని కోరుతున్నారు. జంతువుల ఎన్ క్లోజర్లలో రెగ్యూలర్ గా ఇసుక మార్చడం, బ్లీచింగ్ పౌడర్, పసుపుతో ఎన్ క్లోజర్లను క్లీన్ చేస్తున్నారు.
మహారాష్ట్రలోని చంద్రాపూరూలో కొన్ని పులులు, చిరుత మనుషుల మీద దాడి చేస్తుండడడంతో గత డిసెంబర్ లో నాగ్పూర్ లోని గోరెవాడ రెస్క్యూసెంటర్ కు తరలించారు. అక్కడ వివిధ లక్షణాలు, జ్వరంతో బాధపడిన పులులు డిసెంబర్ చివరి వారంలో చనిపోయాయి. అవి చనిపోయిన తర్వాత శాంపిల్స్ మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న ఐసీఏఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్అఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపించారు. ఈనెల 2వ తేదీన ల్యాబ్ రిపోర్ట్స్ రాగా పులులన్నీ హెచ్5 ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయాయని తేలింది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పశువుల 267.7 లక్షలు ఉండగా ఇందులో 50.3 లక్షల పశువులు, 41.9 లక్షల గేదెలు, 128.7 లక్షల గొర్రెలు మరియు 46.7 లక్షల మేకలు ఉన్నాయి. తెలంగాణ 42.1 లక్షల టన్నుల పాలు ఉత్పత్తి చేస్తున్నది. మాంసం ఉత్పత్తి 5.1 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నది. ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర అంతటా హై అలర్ట్ ప్రకటించింది. రెస్క్యూసెంటర్ లో ఉన్న మిగతా జంతువులకు కూడా పరీక్షలు నిర్వహించారు. పచ్చి మాంసం తినడం, లేదా బర్డ్ ఫ్లూ సోకిన ఫుడ్ తినడం వల్ల ఆ పులులకు బర్డ్ ఫ్లూ సోకి ఉండొచ్చని భావిస్తున్నారు.
దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న జూలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. బర్డ్‌ఫ్లూ అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా వలస పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వలస పక్షలు మన పక్షులతో కలవకుండా ఎన్ క్లోజర్లను ఒకవైపే ఓపెన్చేసి పెట్టిన అధికారులు. పక్షులకు, జంతువులకు ఇచ్చే నీళ్లలో యాంటీ బయాటిక్స్, మల్టీ విటమిన్స్ ఇస్తున్నారు. మల, మూత్ర శాంపిల్స్ తీసుకుని పరీక్ష చేస్తున్న జూ అధికారులు. చికెన్, మటన్, బీఫ్ వేడి చేసి ఇస్తున్నట్లు జూపార్క్ అధికారులు వెల్లడించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..