AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులకు TGPSC పండుగలాంటి వార్త.. ఇది కదా కావాల్సింది

ఏప్రిల్ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించింది TGPSC . ఇక నుంచి ఏ ఏడాది ఖాళీలను ఆ ఏడాదిలోనే భర్తీ చేస్తామన్నారు TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం. మార్చి 31నాటికి పెండింగ్‌ నోటిఫికేషన్ల ఫలితాలను రిలీజ్ చేస్తామన్నారు. ఆ వివరాలు..

Telangana: నిరుద్యోగులకు TGPSC పండుగలాంటి వార్త.. ఇది కదా కావాల్సింది
Students
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Jan 08, 2025 | 10:53 PM

Share

కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగ నోటిఫికేష‌న్లపై క్లారిటీ ఇచ్చారు TGPSC చైర్మన్ బుర్రా వెంకటేశం. ఏప్రిల్ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కుండబద్దలు కొట్టారు. మార్చి 31 వ తేదీలోగా ఖాళీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారాయన. ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలపై కసరత్తు చేసి ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన 6 నెలల నుంచి 8 నెలల లోపే ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామన్నారు బుర్రా వెంకటేశం.

TGPSC నియామకాల్లో ఇప్పటికే ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టిసారించామన్నారు TGPSC చైర్మన్ . ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతను పెంచేందుకు చర్యలు చేపడుతామన్నారు. యూపీఎస్సీలోని మంచి విధానాలను తీసుకుంటామన్నారు. పరీక్షకు ఒక్కరోజు ముందే ప్రశ్నాపత్రం తయారు చేయాలని భావిస్తున్నామన్నారాయన.

ఇక నుంచి ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాదిలోనే భర్తీ చేస్తామన్నారు బుర్రా వెంకటేశం. అభ్యర్థులకు TGPSCపై నమ్మకం పెంచేలా తమ చర్యలు ఉంటాయన్నారు బుర్రా వెంకటేశం. అవకతవకలకు తావులేకుండా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కొత్త సంవత్సరంలో నిరుద్యోగులను నిరాశపర్చబోమన్నారు TGPSC చైర్మన్. ఈ మార్చి 31 నాటికి TGPSC దగ్గర పెండింగ్‌లో ఉన్న అన్ని ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారాయన.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!