Fish Flood: వర్షాలకు కొట్టుకొస్తున్న భారీ చేపలు.. ఆటోల్లో నింపుకెళ్తున్న జనం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద ప్రవాహంతో పాటు చేపల ప్రవాహం కనబడుతుంది చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏ రోడ్డు చూసినా వరద కనబడుతుంది వరద ప్రవాహంతో చేపలని కొట్టుకు వస్తున్నాయి.

వానొచ్చెనంటే.. వరదొస్తాది.. వరదొచ్చెనంటే.. భారీగా చేపలు వస్తాయి అంటున్నారు కొన్ని గ్రామస్థులు. అవును ఓ వైపు భారీ వర్షాలు.. నెలకు సరిపడా వానలతో వరద భీభత్సం సృష్టిస్తుంది. దీంతో భారీ వర్షాలకు చేపలే చేపలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. ఒక్కో చేప పది కిలోల పైననే ఉంది. దీంతో జనం ఎగబడి ఆ చేపలను ఆటోలో తరలిస్తున్నారు. వరద పోటెత్తుతుండడంతో చేపలు పైకి ఎగబడుతున్నాయి. కల్వర్టు వద్ద మత్స్య కార్మికుల హడావిడి కనబడుతుంది
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వరద ప్రవాహంతో పాటు చేపల ప్రవాహం కనబడుతుంది చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఏ రోడ్డు చూసినా వరద కనబడుతుంది వరద ప్రవాహంతో చేపలని కొట్టుకు వస్తున్నాయి. రామడుగు మండలం వెలిచాల వద్ద వందలాది మంది మత్స్య కార్మికుల హడావిడి కనబడుతుంది. కల్వర్టుపై నుంచి వస్తున్న వరదలు భారీ సైజులోని చేపలు కొట్టుకొస్తున్నాయి. వలల ద్వారా చేపలు పడుతున్నారు బరువైన చేపలకు వలలు కూడా తట్టుకోవడం లేదు. ఒక్కో దశలో వలలే వరదలో కొట్టుకుపోతున్నాయి. దాదాపున ప్రతి చేప పది కిలోల పైననే ఉన్నది ఒక్కోసారి వలవేస్తే రెండు సంచుల చేపలు పడుతున్నాయి. చేపలన్ని తీసుకెళ్లడానికి ప్రత్యేకంగా ఆటోలను తెచ్చుకున్నారు. చివరికి ఆటోలు కూడా సరిపోలేదు 10 చేపలు ఆటోలో వేస్తే నిండిపోతున్నాయి.
ఈ చేపలలో రవ్వు, బొచ్చ, జెల్లలు, బంగారు, తీగ వివిధ రకాల చేపలను పట్టారు మత్స్య కార్మికులు. కల్వర్టు దగ్గర ఒక జాతరల కనబడింది అంతేకాకుండా చేపలు పట్టడం చూడటానికి చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. భారీ చేపలను చేతిలో పట్టుకొని చాలామంది సెల్ఫీలు దిగారు. ఇంత పెద్ద చేపలను ఎన్నడూ చూడలేదంటూ స్థానికులు చెబుతున్నారు. కేవలం వెలిచాల కాదు వివిధ ప్రాంతాల్లో కూడా భారీ సైజులో చేపలు దర్శనమిస్తున్నాయి. ఈ వరదలో కొట్టుకు వచ్చిన చేపల్ని తీసుకెళ్లడానికి వ్యాపారస్తులు నేరుగా చేపలు పట్టే ప్రాంతానికి వెళ్తున్నారు. ఇక ఇప్పుడు ప్రతి ఇంట్లో చేపల రుచిని ఎంజాయ్ చేయనున్నారు. ఓ వైపు చలి మరోవైపు చేపల కర్రీతో స్థానికులు ఎంజాయ్ చేస్తున్నారు అన్ని కల్వర్టులు కూడా చేపల మార్కెట్ లా తయారయ్యాయి మీరు భారీ చేపలు చూడాలంటే… కొనుగోలు చేయాలంటే కరీంనగర్ జిల్లాకు రావాల్సిందే.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
