Telangana: కొడుకు కోసం రెండో పెళ్లి చేసుకున్న భర్త.. బిడ్డ పుట్టాడు కానీ.. ఆ తర్వాతే సీన్ మారింది..
అమ్మయిలు పుట్టడంతో.. అబ్బాయి కోసం భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత ఉన్నదంతా ఆ భార్యకే కట్టబెడుతుండటంతో .. మొదటి భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఉన్న ఆస్తి అంత రెండో భార్యకే కట్టబెడుతున్నాడంటూ కూతురుతో కలిసి భర్త ఇంటిముందు మొదటి భార్య ఆందోళనకు దిగింది.

అమ్మయిలు పుట్టడంతో.. అబ్బాయి కోసం భర్త మరో పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వాత ఉన్నదంతా ఆ భార్యకే కట్టబెడుతుండటంతో .. మొదటి భార్య ఆందోళనకు దిగింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఉన్న ఆస్తి అంత రెండో భార్యకే కట్టబెడుతున్నాడంటూ కూతురుతో కలిసి భర్త ఇంటిముందు మొదటి భార్య ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానంటూ భీష్మించుకుని కూర్చుంది. వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జంగా సంజీవరెడ్డి.. వనజకు 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో వారసుడు లేడని సంజీవరెడ్డి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు ఓ కొడుకు పుట్టాడు.. అయితే అప్పటినుండి సంజీవరెడ్డి మొదటి భార్య వనజ గొడవ పడుతుండేవాడు.. వేధింపులు ఎక్కువయ్యాయి..
భర్త టార్చర్ భరించలేక వనజ తన పుట్టిల్లు అయిన మానకొండూరు మండలం చల్లూరుకు తన ఇద్దరు కూతుర్లతో వెళ్లిపోయింది. అయితే సంజీవరెడ్డి రెండో భార్యకు ఓ కుమారుడు ఉన్నాడు. అతని పేరిట ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడని మొదటి భార్య వనజ పేర్కొంది.. తన కూతుర్లు శ్రీ వర్ష, శ్రీజ ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్నారని, వారిని చదివించి, పెళ్లి చేసే స్తోమత కూడా తన వద్ద లేదని, ఆస్తి మొత్తం రెండో భార్య కుమారుడికి రాసిస్తే తన పిల్లల పరిస్థితి ఏంటని, అత్తింటి ముందు బైఠాయించి కూతురుతో ఆందోళన చేపట్టింది భార్య వనజ..
అయితే ఈ విషయం తెలుసుకున్న భర్త సంజీవరెడ్డి ఇంటి వైపు రావడంలేదని, ఇంట్లోని అత్తమామలు తమను ఇంట్లోకి రానివ్వడం లేదని, రాత్రంతా ఆరుబయటే నిద్రించామని వనజ తెలిపింది.. కనీసం మంచినీరు కూడా ఇవ్వకుండా తాళం వేసుకొని వెళ్లిపోయారని బోరున విలపిస్తున్నారు వనజ, కూతురు శ్రీ వర్ష. కేవలం వంశోద్ధారకుడు లేడన్న సాకుతో మొదటి భార్య వనజను, ఇద్దరి ఆడపిల్లలను దూరం పెట్టాడని తమకు న్యాయం చేయాలని మీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకుంది మొదటి భార్య వనజ.
తమకు న్యాయం చేయాలని కోరిన.. తన తండ్రి ఏమాత్రం సమాధానం ఇవ్వడం లేదని.. పట్టించుకోవడం లేదని కూతురు శ్రీవర్ష పేర్కొంది..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
