AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. తెల్లవారుజామున ఘోరం.. తండ్రి, కొడుకు మృతి.. రెప్పపాటులో..

తెల్లవారుజామున ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో తండ్రీ కొడుకు.. ఇద్దరూ మృతి చెందారు.. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని ఎల్లాపురం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

అయ్యో దేవుడా.. తెల్లవారుజామున ఘోరం.. తండ్రి, కొడుకు మృతి.. రెప్పపాటులో..
Father, Son Die in Tragic Electrocution
N Narayana Rao
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jun 25, 2025 | 9:43 AM

Share

తెల్లవారుజామున ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో తండ్రీ కొడుకు.. ఇద్దరూ మృతి చెందారు.. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇల్లందు ఎల్లాపురం గ్రామంలో ఏనుగు నరసయ్య (56) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నారు. కూలీ పని చేసి వచ్చి ఇంట్లో పడుకున్న నరసయ్య తెల్లవారుజామున వాష్ రూమ్ కు వెళ్లాడు.. ఈ క్రమంలో.. విద్యుత్ స్తంభానికి చెందిన కరెంట్ తీగ ప్రమాదవశాత్తు ఇంటి రేకుకు తగిలింది.. అంతేకాకుండా దుస్తులు ఆరేసుకునే ఇనుప తీగకు విద్యుత్ సరఫరా అయింది..

అది గమనించకుండా నరసయ్య తీగను పక్కకి అని వాష్ రూమ్ కు వెళ్లాలనుకున్నాడు.. అలా తీగను పట్టుకోగానే.. నరసయ్య విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు.. అయితే.. తండ్రికి ఇలా జరిగిందని గమనించకుండా వచ్చిన కొడుకు కూడా నరసయ్యతో పాటు విద్యుత్ షాక్ తగిలి స్పాట్లోనే మృతి చెందాడు.

ఇదే క్రమంలో నరసయ్య భార్య కూడా వచ్చి విద్యుత్ షాక్ కు గురైంది.. గమనించిన పక్కింటివాళ్లు వెంటనే మెయిన్ ఆఫ్ చేసి ఆమెను కాపాడారు.. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే.. తండ్రి కొడుకు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..