AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కీచక తండ్రికి కఠిన శిక్ష.. ఏకంగా ముగ్గురు పిల్లలపై అఘాయిత్యం..

చందనగర్‎లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో ఎట్టకేలకు న్యాయం జరిగింది. ముగ్గురు పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు పెంపుడు తండ్రి. 2022లో చోటు చేసుకున్న ఈ ఘటనలో తాజాగా రాజేంద్రనగర్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరు కుమార్తెలతో పాటు ఒక కుమారుడిని పదేపదే లైంగికంగా వేధించిన పెంపుడు తండ్రికి 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది.

కీచక తండ్రికి కఠిన శిక్ష.. ఏకంగా ముగ్గురు పిల్లలపై అఘాయిత్యం..
Rajendra Nagar
Lakshmi Praneetha Perugu
| Edited By: Srikar T|

Updated on: Jun 29, 2024 | 4:54 PM

Share

చందనగర్‎లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో ఎట్టకేలకు న్యాయం జరిగింది. ముగ్గురు పిల్లలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు పెంపుడు తండ్రి. 2022లో చోటు చేసుకున్న ఈ ఘటనలో తాజాగా రాజేంద్రనగర్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇద్దరు కుమార్తెలతో పాటు ఒక కుమారుడిని పదేపదే లైంగికంగా వేధించిన పెంపుడు తండ్రికి 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. రాజేంద్రనగర్‎లోని పోక్సో కేసులు డీల్ చేసే స్పెషల్ కోర్ట్ ఈ తీర్పులను వెల్లడించింది. 2022లో చందానగర్‎లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్యకు మొదటి భర్తతో పుట్టిన పిల్లలతో ప్రతినిత్యం అసభ్యంగా ప్రవర్తించేవాడు నిందితుడు. తన భార్య ఇంట్లో లేని సమయంలో పిల్లలపై నీచంగా ప్రవర్తించాడు. ఇద్దరు బాలికలతో పాటు తన కుమారుడుపైన అసభ్యంగా ప్రవర్తించడంతో చిన్నారులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనోవేదనకు గురయ్యారు. వారి బాధని తల్లితో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న చిన్నారులు తమ ఇంటి పక్కనే నివాసముండే మరో వ్యక్తితో విషయాన్ని పంచుకున్నారు.

విషయం తెలిసిన సదరు వ్యక్తి పిల్లలను తీసుకొని నేరుగా చందానగర్ పోలీస్ స్టేషన్‎కు వెళ్ళాడు. జరిగిన ఉదాంతం మొత్తాన్ని ముగ్గురు చిన్నారులు పోలీసులకు చెప్పటంతో గంట వ్యవధిలోనే చందానగర్ పోలీసులు ఆ కీచక పెంపుడు తండ్రిని అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు. సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత ఈ కేసులో రాజేంద్రనగర్ స్పెషల్ కోర్ట్ తీర్పు వెలడించింది. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించింది. మరోవైపు దాడికి గురైన ఇద్దరు బాలికలకు ఐదు లక్షల రూపాయల పరిహారంతో పాటు బాలుడికి రూ.50 వేల రూపాయల పరిహారాన్ని కోర్టు ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించిన ట్రైల్ సమయంలో మెజిస్ట్రేట్ ముందు చిన్నారులు జరిగిన ఉదంతం మొత్తాన్ని చెప్పారు. మెడికల్ ఎవిడెన్స్‎తో పాటు సాక్షాలను పరిగణలోకి తీసుకున్న కోర్ట్ పెంపుడు తండ్రికి శిక్ష ఖరారు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..