- Telugu News Photo Gallery AP deputy CM Pawan Kalyan visits Kondagattu Anjaneya Swamy Temple See Pics
Pawan Kalyan: కొండగట్టు అంజన్న సన్నిధిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోలు చూశారా..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు క్షేత్రం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పవన్ కల్యాణ్ కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనం అందించారు.
Updated on: Jun 29, 2024 | 4:06 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టు క్షేత్రం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పవన్ కల్యాణ్ కు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనం అందించారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గన వెళ్లారు.. మధ్యాహ్నం కొండగట్టుకు చేరుకున్న పవన్ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

వారాహి విజయ యాత్రకు ముందు వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించి ముడుపులు కట్టిన విషయం విదితమే. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం తెలంగాణ, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాన స్థానాచార్యులు కపీంద్ర స్వామి పవన్ కళ్యాణ్ కు సంప్రదాయబద్దంగా తలపాగ చుట్టి ఆలయంలోకి ఆహ్వానించారు.

అనంతరం శ్రీ ఆంజనేయస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయస్వామికి ఇరు వైపులా ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ అమ్మవార్లకు అర్చనలు చేసిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించి, స్వామి వారి ప్రసాదం అందజేశారు.

సార్వత్రిక ఎన్నికల్లో విజయానంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు తెలంగాణలో జనసేన శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చి సాగనంపారు. తుర్కపల్లి, శామీర్ పేట, సిద్ధిపేట, కరీంనగర్, గంగాధర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలలతో స్వాగతించారు.

పవన్ కళ్యాణ్ విజయానికి చిహ్నంగా తల్వార్ బహూకరించి జేజేలు పలికారు. పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ప్రాంతం అంతా పార్టీ శ్రేణులు అభిమానులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగారు.
