ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లిన రైతు..చేతిలో పెట్రోల్‌ డబ్బా !

పెట్రోల్‌ దాడిలో మృతిచెందిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి ఉద్దాంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విజయారెడ్డి ఇన్సిడెంట్‌ తర్వాత చాలా చోట్ల రెవెన్యూ అధికారులు స్వీయ రక్షణా చర్యలు మొదలుపెట్టారు. ఎక్కడ ఏ చిన్నా అనుమానం కలిగినా చాలా సీరియస్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ఎట్నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి పెట్రోల్‌ డబ్బాతో వచ్చిన రైతు అక్కడి అధికారులను కంగారు పెట్టించాడు. చివరకు […]

ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లిన రైతు..చేతిలో పెట్రోల్‌ డబ్బా !
Anil kumar poka

|

Nov 09, 2019 | 7:07 PM

పెట్రోల్‌ దాడిలో మృతిచెందిన అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి ఉద్దాంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విజయారెడ్డి ఇన్సిడెంట్‌ తర్వాత చాలా చోట్ల రెవెన్యూ అధికారులు స్వీయ రక్షణా చర్యలు మొదలుపెట్టారు. ఎక్కడ ఏ చిన్నా అనుమానం కలిగినా చాలా సీరియస్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ఎట్నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోననే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి పెట్రోల్‌ డబ్బాతో వచ్చిన రైతు అక్కడి అధికారులను కంగారు పెట్టించాడు. చివరకు అసలు విషయం తెలిసి అవాక్కయారు. జిల్లాలోని రామన్న పల్లె గ్రామానికి చెందిన పన్యాల చంద్రయ్య అనే రైతు బద్దనపెల్లికి చెందిన నర్సింహరెడ్డి దగ్గర 29 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. దానిని తన భార్య లింగవ్వ పేరుమీద రిజిస్టర్‌ చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయమై ఎమ్మార్వో ఆఫీసులో ఆరా తీసేందుకు వచ్చాడు. అయితే, తమ గ్రామం నుంచి ఎప్పుడు సిరిసిల్ల వచ్చినా..తన మోటార్‌ సైకిల్‌కు కావాల్సిన పెట్రోల్‌ తీసుకు వెళ్లటం చంద్రయ్యకు అలవాటు. ఈ సారి కూడ తన బండ్లోకి కావాల్సిన పెట్రోల్‌ తీసుకుని, వెళ్తూ.. ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చాడు. పట్టా మార్పిడి కోసం సంతకం పెట్టేందుకు తన భార్యను ఎప్పుడు తీసుకురావాలంటూ అడిగేందుకు వచ్చాడట. ఇంతలోకే రైతు చేతిలో ఉన్న పెట్రోల్‌ బాటిల్‌ ను గమనించిన ఆర్‌ఐ, ఇతర సిబ్బంది పరుగు పరుగున వచ్చారు. చేతిలో ఉన్న పెట్రోల్‌ డబ్బా దేనికంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తీరా విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే చంద్రయ్యకు తగిన సమాచారం అందించి అక్కడి నుంచి పంపించేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu