తల్లి మరణం తట్టుకోలేక..ఆ కొడుకు గుండె ఆగింది

తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగిపోయింది. కనిపెంచిన కన్నతల్లి ఇక లేదని తెలిసి ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడు. అమ్మ మరణవార్త విన్న వెంటనే తాను కూడా తనువు చాలించాడు. ఈ విషాదం సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో సంభవించిన తల్లికొడుకుల హఠ్మారణం ఆ ఇంటిని తీరని విషాదంలో ముంచేసింది. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ఒకేరోజు తల్లి కుమారుడు మరణించారు. బచ్చోడు గ్రామానికి చెందిన పులి పలుపుల శాంతమ్మ(70) అనారోగ్యంతో […]

తల్లి మరణం తట్టుకోలేక..ఆ కొడుకు గుండె ఆగింది
Follow us

|

Updated on: Nov 09, 2019 | 8:49 PM

తల్లి మరణం తట్టుకోలేక ఓ కొడుకు గుండె ఆగిపోయింది. కనిపెంచిన కన్నతల్లి ఇక లేదని తెలిసి ఆ కుమారుడు తట్టుకోలేకపోయాడు. అమ్మ మరణవార్త విన్న వెంటనే తాను కూడా తనువు చాలించాడు. ఈ విషాదం సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో సంభవించిన తల్లికొడుకుల హఠ్మారణం ఆ ఇంటిని తీరని విషాదంలో ముంచేసింది. జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామంలో ఒకేరోజు తల్లి కుమారుడు మరణించారు. బచ్చోడు గ్రామానికి చెందిన పులి పలుపుల శాంతమ్మ(70) అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆమె మరణ వార్త విన్న పెద్ద కొడుకు వెంకన్న(50)తల్లి శాంతమ్మ మరణవార్త వినగానే గంట వ్యవధిలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఆ కుటుంబంలో శాంతమ్మ కు ఐదుగురు కుమారులు కాగా, వెంకన్న పెద్ద కుమారుడు తల్లి పెద్ద కుమారుడు పై ఎక్కువ ప్రేమానురాగాలు చూపడంతో తల్లి మరణ వార్త విన్న కుమారుడు తట్టుకోలేక తీవ్ర మనోవేదనకు లోనయ్యాడని, ఆ భాదలోనే హార్ట్‌ ఎటాక్‌ వచ్చి చనిపోయాడని వారి కుటుంబీకులు తెలిపారు. మృతుడు వెంకన్నకు భార్య ఇద్దరు కూతుళ్లు ఓ కుమారుడు ఉన్నారు. ఒకే కుటుంబంలో తల్లికొడుకులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లి తో పాటే కుమారుడి దహన సంస్కారాలు కూడా ఒకేసారి నిర్వహించారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?