పొలంలోని పశువుల కొట్టంలో వింత ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె ఆగినంత పనైంది..
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. ఆ రైతు పశువుల కొట్టంలో క్షుద్ర పూజలు నిర్వహించిన గుర్తు తెలియని వ్యక్తులు.. పరిసర ప్రాంత రైతులంతా హడలెత్తి పోయేలా చేశారు. పిండితో మనిషిబొమ్మను తయారుచేసి ఆ బొమ్మకు క్షుద్రపూజలు నిర్వహించారు.

వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి.. ఆ రైతు పశువుల కొట్టంలో క్షుద్ర పూజలు నిర్వహించిన గుర్తు తెలియని వ్యక్తులు.. పరిసర ప్రాంత రైతులంతా హడలెత్తి పోయేలా చేశారు. పిండితో మనిషిబొమ్మను తయారుచేసి ఆ బొమ్మకు క్షుద్రపూజలు నిర్వహించారు. ఈ క్షుద్రపూజల ఘటన రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో కలకలం రేపింది. ఎల్లయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఈ క్షుద్ర పూజలు జరిగాయి. పొలంలోని పశువుల కొట్టంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు జరిపారు. పౌర్ణమి గడియల్లో పిండి బొమ్మతో మనిషి ప్రతిరూపాన్ని తయారుచేసి ఆ పిండి బొమ్మకు క్షుద్ర పూజలు నిర్వహించారు.
పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఏప్పటిలాగే తన వ్యవసాయ క్షేత్రానికి పని కోసం వచ్చిన రైతు తన పశువుల కొట్టంలో క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాళ్లు చూసి హడలెత్తిపోయారు.
వీడియో చూడండి..
ఎవరైనా పగతో ఇలాంటి పని చేశారా..! లేక గత ఎడాది ఇతనికి మంచి దిగుబడి రావడంతో కండ్లమంటతో ఇలాంటి పనిచేశారా..! లేక ఇంకేదైనా కారణాలతో రైతును బెదిరించడం కోసం ఇలాంటి పని చేశారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ క్షుద్ర పూజల కలకలం నేపథ్యంలో వ్యవసాయ పనుల కోసం పొలాల వద్దకు వెళ్లాలంటే రైతులు, కూలీలు భయాందోళన చెందుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
