బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం..! స్థానిక సంస్థ ఎన్నికల్లో..
తెలంగాణ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు ఆమోదం లభించింది. గతంలో ఉన్న పదేళ్ల రిజర్వేషన్ల చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఈ అంశంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీ రాజ్ చట్ట సవరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రస్తుతం చర్చ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అసెంబ్లీని ప్రోరోగ్ చేసిన గవర్నర్. గతంలో పదేళ్ల పాటు రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం ఉన్న విషయం తెలిసిందే. అయితే గత చట్టంలో మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆమోద ముద్ర వేసింది తెలంగాణ కేబినెట్ కమిటీ.
త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు..
బీసీలకు 42 శాతం అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఆర్డినేన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒక సారి మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25న మరోసారి కేబినెట్ భేటీ ఉంటుందని తెలిపారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ చేయాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు. గోవులు సంరక్షణకు, రూ.122 కోట్లతో 82 కోట్ల చేప పిల్లలను విడుదలకు, వచ్చే మార్చి లోపు లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
