AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు రోజులపాటు వైన్ షాపులు బంద్.. కారణం ఏంటంటే..

హైదరాబాద్‌ పరిధిలోని మందుబాబులకు అలర్ట్.. రెండు రోజులపాటు (48 గంటలు) వైన్ షాపులు బంద్ కాబోతున్నాయి.. దీనిపై పోలీసు శాఖ కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మ‌హంకాళి బోనాల నేప‌థ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌ద్యం దుకాణాలు మూసివేయ‌నున్నారు.

రెండు రోజులపాటు వైన్ షాపులు బంద్.. కారణం ఏంటంటే..
Wine Shop
Shaik Madar Saheb
|

Updated on: Jul 10, 2025 | 8:25 PM

Share

హైదరాబాద్‌ పరిధిలోని మందుబాబులకు అలర్ట్.. రెండు రోజులపాటు (48 గంటలు) వైన్ షాపులు బంద్ కాబోతున్నాయి.. దీనిపై పోలీసు శాఖ కీలక ప్రకటన చేసింది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మ‌హంకాళి బోనాల నేప‌థ్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌ద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు మూసివేయ‌నున్నట్లు హైదరాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ ప్రకటనలో తెలిపారు. సెంట్రల్, ఈస్ట్, నార్త్ జోన్ల ప‌రిధిలోని మ‌ద్యం దుకాణాలను మూసివేయ‌నున్నట్లు వెల్లడించారు.

శ్రీ ఉజ్జయిని మహంకాళి జాతర సందర్భంగా జూలై 13న ఉదయం 6 గంటల నుంచి జూలై 15న ఉదయం 6 గంటల వరకు 11 పోలీస్ స్టేషన్ల పరిధిలోని మద్యం దుకాణాలను మూసివేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశించారు. ప్రశాంతంగా బోనాలు ఉత్సవాలను నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

గాంధీ న‌గ‌ర్, చిల‌క‌ల‌గూడ‌, లాలాగూడ‌, వారాసిగూడ‌, బేగంపేట‌, గోపాల‌పురం, తుకారం గేట్, మారేడ్‌ప‌ల్లి, మ‌హంకాళి, రాంగోపాల్‌పేట్, మోండా మార్కెట్.. మొత్తం 11 పోలీసు స్టేష‌న్ల ప‌రిధిలో మ‌ద్యం దుకాణాల‌ను మూసివేయాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఎవరైనా మద్యం అమ్ముతూ.. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని.. పోలీసు వారికి అందరూ సహకరించాలని కోరారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే