AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HCAలో దొంగలుపడ్డారు..! క్రికెటర్లను అందించమంటే ఈ కక్కుర్తి ఏంటి..?

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అంటేనే వివాదాలకు కేరాఫ్‌ అనే పేరు పడిపోయింది. నిత్యం అంతర్గత కలహాలే అక్కడ. నిధుల గోల్‌మాల్‌ వార్తలైతే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. HCAలోని అవినీతి ఇన్నింగ్స్‌ గురించి చెప్పాల్సిన పనే లేదు. HCA అంటేనే అంత అన్నప్పుడు.. ఎందుకని ప్రత్యేకంగా అక్కడ జరిగే అవినీతి, పరిణామాల గురించి చెప్పుకోవాలి? గతంలో HCAకి అధ్యక్షులుగా చేసిన కొందరిపై ఎన్నో ఆరోపణలున్నాయ్. కేసులు కూడా రిజిస్టర్‌ అయ్యాయ్. బట్.. ఫర్‌ ద ఫస్ట్ టైమ్.. HCA అధ్యక్షుడిని అరెస్ట్‌ చేశారు. చాలా సీరియస్‌గా చూడాల్సిన కేసు కూడా..

HCAలో దొంగలుపడ్డారు..! క్రికెటర్లను అందించమంటే ఈ కక్కుర్తి ఏంటి..?
Hca Case
Shaik Madar Saheb
|

Updated on: Jul 10, 2025 | 9:47 PM

Share

తెలంగాణ సీఐడీ ఓ నోట్‌ రిలీజ్‌ చేసింది. ‘ఫోర్జరీ డాక్యుమెంట్స్‌ పెట్టి, ఎన్నికల్లో పోటీ చేసి, HCA అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు’ అనేది జగన్‌మోహన్‌రావుపై సీఐడీ చేసిన ఆరోపణ. అంతేకాదు.. అధ్యక్షుడి హోదాలో నిధులు గోల్‌మాల్‌ చేశారనేందుకు ప్రాధమిక సాక్ష్యాలు కూడా ఉన్నాయంటున్నారు. అరెస్ట్‌కు కారణం ఇదేనని ఓ క్లారిటీ ఇచ్చింది సీఐడీ. జగన్‌మోహన్‌రావుతో పాటు మరో నలుగురురిని కూడా అదుపులోకి తీసుకుంది. ఇంతకీ ఈ కథలో ఏం జరిగిందంటే.. గౌలిపురా క్రికెట్‌ క్లబ్‌ ఉంది హైదరాబాద్‌లో. ఆ క్లబ్‌ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్. ఈయన మాజీ మంత్రి కూడా. ఈ కృష్ణయాదవ్‌ సంతకాన్ని శ్రీచక్ర క్లబ్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్న కవిత ఫోర్జరీ చేశారు. కవితకు HCA ఆఫీస్‌ బేరర్‌ రాజేందర్‌ యాదవ్‌ సహకరించారు. వీళ్లిద్దరూ భార్యాభర్తలు కూడా. అలా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను జగన్మోహన్‌కు ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్‌ ఉపయోగించే.. HCA అధ్యక్ష పదవికి పోటీ చేశారు జగన్‌మోహన్‌రావు. HCAకి అధ్యక్షుడు అయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది జగన్‌మోహన్‌రావుపై ఉన్న ప్రధాన అభియోగం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ఈ నిధుల దుర్వినియోగంపై నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారు. సో, అలా రంగంలోకి దిగిన సీఐడీ.. HCA అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కంటేలతో కలిసి సుమారు 2 కోట్ల 32 లక్షల రూపాయల నిధులను అక్రమంగా ఉపయోగించినట్లు తేల్చింది. అందుకే, జగన్‌మోహన్‌రావును అరెస్ట్‌ చేసింది. సహకరించిన HCA...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.