Falaknuma Express Fire Accident: ప్రయాణికుడు సిగరెట్ తాగడం వల్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైళ్లో ప్రమాదం : ప్రత్యక్ష సాక్షి
హౌరా నుంచి సికింద్రాబాద్ బయల్దేరిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు క్షణాల్లోనే రెండు బోగీలకు అంటుకున్నాయి. రైలు నిండా దట్టంగా అలుముకున్న పొగలతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే రైల్లోంచి కిందకు దిగిపోయారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైళ్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వరుసగా మూడు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌తో రైళ్లో మంటలు చెలరేగినట్టుగా సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి దగ్గర ఘటన జరిగింది. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే రైళ్లోంచి కిందకు దిగిపోవటం ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది సైతం హుటాహుటినా స్పందించారు. రెండు బోగిల్లోంచి ప్రయాణికుల్ని వెంటనే కిందకు దింపేయటంతో ప్రాణనష్టం తప్పింది.
హౌరా నుంచి సికింద్రాబాద్ బయల్దేరిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యాపించిన మంటలు క్షణాల్లోనే రెండు బోగీలకు అంటుకున్నాయి. రైలు నిండా దట్టంగా అలుముకున్న పొగలతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే రైల్లోంచి కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.
మరోవైపు రైల్వే సిబ్బంది సైతం అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రయాణికులను హుటాహుటినా రైల్లోంచి కిందకు దింపేశారు. యాదాద్రి జిల్లా పగిడి పల్లిలో రైలును నిలిపివేశారు అధికారులు. s4, S5, s6 బోగీలకు మంటలంటుకున్నాయి. దీంతో మూడు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. రైల్వే సిబ్బంది, ఫైర్ సెఫ్టీ బృందాలను సంఘటన స్థలానికి చేరుకున్నాయి. ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం పూర్తిగా అదుపులోకి వస్తేగానీ, పూర్తి సమాచారం తెలియదు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..