- Telugu News Photo Gallery Why does alcohol not freeze even in the deep freezer Know the reason behind this Telugu News
Alcohol Not Freeze : డీప్ ఫ్రీజర్‌లో కూడా ఆల్కహాల్ ఎందుకు గడ్డకట్టదు..? కారణం ఏంటో తెలుసా..?
ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నప్పుడు, అణువులు కలిసి అతుక్కోవడం, పటిష్టంగా మారిపోయి గడ్డకట్టడం జరుగుతుంది. ప్రతి పదార్ధం వేర్వేరు గడ్డకట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నీరు 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఘనీభవించి మంచుగా మారుతుంది. అయితే ఆల్కహాల్ -114 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడుతుంది.
Updated on: Jul 07, 2023 | 10:48 AM

లిక్కర్ ఫ్రీజర్‌లో ఉంచినా అది గడ్డకట్టదు. డీప్ ఫ్రీజరల్‌లో పెట్టిన ఏ ద్రవపదార్థం అయిన సరే, కొంత సమయానికి అది గడ్డకట్టిపోతుంది. కానీ, ఆల్కహాల్‌ని ఎంతసేపు ఫ్రీజ్‌లో ఉంచినా అది ఎందుకు గడ్డకట్టదో ఎప్పుడైనా ఆలోచించారా..? దీనికి వెనుకనున్న కారణమేమిటో తెలుసా..?

ప్రతి ద్రవ పదార్ధంలోనూ దాని అంతర్గత ఉష్ణోగ్రత, శక్తిని కలిగి ఉంటుంది. చుట్టుపక్కల ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, దానిలోని శక్తి తగ్గుతుంది. అందులో ఉండే అణువులు ఒకదానికొకటి పూర్తిగా దగ్గరగా వస్తాయి. దీంతో పదార్థం ఘనీభవించడం ప్రారంభమవుతుంది.

ప్రతి పదార్ధం వేర్వేరు గడ్డకట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నీరు 0 డిగ్రీల సెల్సియస్ వద్ద ఘనీభవించి మంచుగా మారుతుంది. అయితే ఆల్కహాల్ -114 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గడ్డకడుతుంది.

నీరు, ఆల్కహాల్ రెండూ ద్రవ పదార్థాలే అయినప్పటికీ ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది? అనే విషయానికి వస్తే.. గడ్డకట్టే సామర్థ్యం అణువుపై ఆధారపడి ఉంటుంది. నీటి అణువులు ఒకదానికొకటి గట్టిగా పట్టుకుంటాయి. ఆల్కహాల్ స్తంభింపజేయడానికి, ఉష్ణోగ్రత -114 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి.

ఇంట్లో ఉపయోగించే రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 0 నుండి 3 డిగ్రీల సెల్సియస్. డీప్ ఫ్రీజర్ ఉష్ణోగ్రత -10 నుండి -30 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ దానిలో ఘనపదార్థంగా మారదు.




