Monsoon Tourist Places: మీరు ప్రకృతి ప్రేమికులా.. వర్షాకాలంలో పర్యటనకు ఉత్తమమైన ప్రదేశాలు మీకోసం
వర్షాకాలంలో వస్తే ప్రకృతి పచ్చదనంతో నిండి ఉంటుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వర్షాకాలంలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల కోసం చూస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ రోజు మన దేశంలో ప్రకృతి అందాలను ఆస్వాదించే ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
Updated on: Jul 07, 2023 | 8:53 AM

ప్రకృతి అందాలను చూసేందుకు వర్షాకాలం అనువైన సమయం. మీరు ప్రకృతి ప్రేమికులైతే, మీరు తప్పనిసరిగా మన దేశంలో కొన్ని ప్రదేశాలను సందర్శించాలి. వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆరాధించే ప్రదేశాల గురించి తెలుసుకుందాం..

పంచగని - మహారాష్ట్రలోని పంచగని ప్రకృతి అందాలకు నెలవు. వీటిని సందర్శించడానికి వెళ్ళవచ్చు. ఇక్కడి పచ్చటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మీరు ప్రకృతి ప్రేమికులైతే మరపురాని అనుభూతి కోసం పంచగనిని తప్పక సందర్శించండి.

షిల్లాంగ్ - వర్షాకాలంలో షిల్లాంగ్ పర్యటనకు ప్లాన్ చేయండి. ఇక్కడి జలపాతాలు, లోయల అందాలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. మానసిక ఆహ్లాదాన్ని ఇస్తాయి. మీరు ఖచ్చితంగా ఇక్కడ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

కొడైకెనాల్ - తమిళనాడులోని కొడైకెనాల్ అందం వర్షాకాలంలో మరింత పెరుగుతుంది. మీరు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో చిరస్మరణీయమైన సమయాన్ని గడపగలరు. పర్వతాన్ని తాకుతూ వెళ్తున్నట్లు ఉన్న మేఘాలను చూడడం ఎవరికైనా మంచి అనుభూతినిస్తాయి.

మౌంట్ అబూ - ఈ హిల్ స్టేషన్ రాజస్థాన్ లో ఉంది. మీరు ప్రకృతి ప్రేమికులైతే వర్షాకాలంలో ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూసి మీ మనసు మైమరచిపోతుంది.




