Etela Rajendar Fires: స్వరం పెంచిన ఈట‌ల‌.. అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరుః రాజేందర్

అధికార టీఆరెఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మ‌రింత వాయిస్ పెంచారు. దమ్ముంటే ప్రజాస్వామ్య బద్ధంగా హుజూరాబాద్‌లో పోటీ చేసి చూపించాలని సవాళ్లు విసిరారు.

Etela Rajendar Fires: స్వరం పెంచిన ఈట‌ల‌..  అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేరుః రాజేందర్
Etela Rajendar
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 09, 2021 | 1:38 PM

Etela Rajendar Fires on TRS: అధికార టీఆరెఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మ‌రింత వాయిస్ పెంచారు. దమ్ముంటే ప్రజాస్వామ్య బద్ధంగా హుజూరాబాద్‌లో పోటీ చేసి చూపించాలని సవాళ్లు విసిరారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ ఇవాళ పర్యటించారు. నియోజకవర్గంలోని సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టి సీఎం టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా జనం కర్రు కాల్చి వాతపెడతారని, తమ నేతలపై వేధింపులకు పాల్పడితే ఖబడ్దార్‌ అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. అధికార దుర్వినియోగంతో పోలీసుల‌తో తన కార్యకర్తలను ఇబ్బందిపెట్టే ప్రయ‌త్నం చేస్తున్నార‌ని, గొర్ల మంద మీద తోడేళ్లు ప‌డుతున్నట్లు ప‌డుతున్నార‌ని… మీ చ‌ర్యల‌ను ప్రజ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు.

టీఅర్ఎస్ పాలనలో ‘జిల్లా, మండల పరిషత్‌లను నిర్వీర్యం అయ్యాయి. పెన్షన్లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎంపీటీలు, జడ్పీటీలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో పచ్చగా ఉన్నాం. చిచ్చు పెట్టే ఆలోచనలు చేస్తున్నారు. నేను పార్టీ పెట్టలేదు. పార్టీని విడిచిపెట్టలేదు. నన్ను బహిష్కరించారు. ప్రాణం ఉండగానే బొంద పెట్టాలని చూస్తున్నారని ఈట రాజేందర్ ఆరోపించారు. ఎన్నికలు వస్తే గెలిచితీరుతామన్న ఈటల.. జెండా, పార్టీని ప్రజలు చూడటంలేదని, ఈటలను గెలిపించుకోవాలనినుకుంటున్నారని అన్నారు.

తానేమీ గాలికి గెలిచిన వాడిని కాదని, ట్రెండ్‌ వస్తే ఎమ్మెల్యే అయిన వాడిని కాదని ఈటల రాజేందర్‌ అన్నారు. ఎప్పుడో ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైందని టీఆర్ఎస్ సర్కార్‌పై ఈటల ప్రశ్నలు సంధించారు. హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని, వావిలాల, చల్లేరును మండలాలుగా మార్చాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడ జ‌ర‌గ‌బోయే ధ‌ర్మయుద్ధంలో పోలింగ్ బూతుల్లో అధికారులు స‌హ‌క‌రించ‌ర‌ని.. .వారంతా ఈట‌ల వెంటే ఉంటార‌ని ధీమా వ్యక్తం చేశారు.మరోవైపు హరీష్‌రావు చేసిన కామెంట్లపైనా రియాక్ట్‌ అయ్యారు ఈటల. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజ‌ల మ‌న‌సులో ఉండేలా పాల‌న సాగాల‌న్నారు. Read Also… TV9 Special: హిందూ ధర్మ పరిరక్షణకు టీవీ 9 విశేష కృషీ.. కక్షపూరిత ప్రచారం మానుకోవాలని హెచ్చరిక!