TV9 Respect All: సర్వమత సామరస్యానికి టీవీ 9 కట్టుబడి ఉంది.. కక్షపూరిత ప్రచారం మానుకోవాలని విజ్ఞప్తి

సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే టీవీ9 సర్వమత సామరస్యం కోరుతోంది. అదేసమయంలో హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు తగు ప్రాధాన్యతనిస్తోంది.

TV9 Respect All: సర్వమత సామరస్యానికి టీవీ 9 కట్టుబడి ఉంది.. కక్షపూరిత ప్రచారం మానుకోవాలని విజ్ఞప్తి
Tv9 Supports Hindu Dharma And Religious Traditions
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 09, 2021 | 2:00 PM

TV9 Respect All Religious and traditons: సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించే టీవీ9 సర్వమత సామరస్యం కోరుతోంది. అదేసమయంలో హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు తగు ప్రాధాన్యతనిస్తోంది. తెలుగునేల నలుచెరుగులా ఎక్కడ, ఏ కార్యక్రమం జరిగినా కవరేజ్లో ముందుంటుంది. మొదటి నుంచి అదే పంథా అవలంభిస్తోంది. కొత్త బిచ్చగాళ్ల మాదిరి కొందరు టీవీ9 కి వ్యతిరేకంగా కక్షపూరిత ప్రచారానికి పూనుకున్నారు. అలాంటి తాటాకు చప్పుళ్లకు తలొగ్గేది లేదు. ధర్మానికి విరుద్దమైన చర్యలకు టీవీ9 ఎన్నడూ పూనుకోలేదు.. అసలు అలాంటి ఉద్దేశమే టీవీ9కు లేదు.

హిందూ ధర్మ పరిరక్షణ కోసం టీవీ 9 విశేషంగా కృషీ చేస్తుంది. రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షణ మహాసభలు ఎక్కడ నిర్వహించిన టీవీ 9 బాధ్యత గల సంస్థగా ప్రచారం చేస్తుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు టీవీ 9 ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి, ప్రత్యేకంగ ప్రత్యక్ష ప్రసారాలను ఏర్పాటు చేసింది. సోషల్ మీడియా వేదికగా కూడా బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. అలాగే యాదాద్రి బ్రహ్మోత్సవాలతో పాటు ఏ ఆలయంలో, ఏ కార్యక్రమైన బాధ్యతగా కవర్ చేస్తున్నాము. తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల్లో ఏ ఉత్సవం జరిగిన భక్తుల కోసం తమ వంతుగా కృషి చేయడానికి టీవీ 9 ఎప్పుడు ముందుంటుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అయుత మహా చండీయాగం నిర్వహించారు. మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌లో ఈ మహా యాగం రుత్వికుల వేద మంత్రాల మధ్య అట్టహాసంగా జరిగింది. చండీయాగంలో భాగంగా శప్తసతి పారాయణాలు నిత్య హోమాలతో నవదుర్గ పూజలు చేశారు. 111 హోమ గుండాలతో 5 రోజుల పాటు ఈ యాగం జరిగింది. ఈ యాగ నిర్వహణ కోసం 1500 మందికిపైగా రుత్వికులు హాజరయ్యారు. ఈ యాగానికి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలమంది భక్తులు, ప్రముఖ రాజకీయ నేతలంతా హాజరయ్యారు. అయుత మహా చండీయాగాన్ని టీవీ 9 సంస్థ ఐదు రోజులు పాటు నిరంతరం ప్రచారం చేసి అందరి మన్నలను పొందింది. ఇదింతా హిందు ధర్మ పరిరక్షణ కోసం, భక్తుల కోసం కట్టుబడి ప్రచారం చేశాం తప్ప సంస్థకు ఎలాంటి దురుద్దేశాలు లేవు.

దేశంలో, రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను టీవీ 9 ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువచ్చిన సంఘటనలు కూడా అనేక ఉన్నాయి. నిబంధన విరుద్ధంగా హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం జరిగిప్పుడు కూడా తమ బాధ్యతగా టీవీ 9 నిర్వర్తించింది. హిందూ దేవాలయాల్లో ఏమైన అపచారాలు జరుగుతున్నప్పుడు కూడా నిజాయతీ గల సంస్థగా వెలుగులోకి తీసుకువచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని హిందూ ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటి అన్నింటిని టీవీ 9 బాధ్యత గల మీడియా సంస్థగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇప్పుడు కావాలని కొంతమంది వ్యతిరేకులు సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.. ఇలాంటి వాటిపై ధీటుగా స్పందించడమే కాకుండా.. చట్టపరమైన చర్యలకు టీవీ9 వెనుకాడదని స్పష్టం చేస్తున్నాం. Read Also….  https://tv9telugu.com/spiritual/bhishma-niti-in-hindi-for-human-empowerment-481519.html