AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అండగా నిలిచిన తెలంగాణ అమెరికా ఎన్ఆర్ఐ ఫోరం సభ్యులు..

Etela Rajender: తెలంగాణలో ఈటల రాజేందర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న..

Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అండగా నిలిచిన తెలంగాణ అమెరికా ఎన్ఆర్ఐ ఫోరం సభ్యులు..
Etela Rajender
Shiva Prajapati
|

Updated on: May 04, 2021 | 3:20 PM

Share

Etela Rajender: తెలంగాణలో ఈటల రాజేందర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వం తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో గుర్రుగా ఉన్న ఈటల రాజేందర్.. తన దారి తాను చూసుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈటల రాజేందర్.. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరంతో సంప్రదింపులు జరిపారు. ఎన్ఐఆర్ అమెరికా ఫోరం ఆధ్వర్యంలో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు తెలంగాణ ఎన్ఆర్ఐలు.. తెలంగాణను తీసుకువచ్చింది కుటుంబ పాలన కోసమా? అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు మద్ధతు ప్రకటించారు. ఇది ఆత్మగౌరవ ఉద్యమం అని, తెలంగాణలో మరో ఉద్యమం మొదలవ్వబోతోందని వ్యాఖ్యానించారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఈటల రాజేందర్.. పూర్తిగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో తన మొత్తం ఆస్తులపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఈటల పేర్కొన్నారు. ప్రజలను నమ్ముకున్నానని, ప్రలోభాలకు లొంగలేదన్నారు. తనపై తప్పుడు నిందలు వేసి బయటకు గెంటివేస్తున్నారని ఈటల వ్యాఖ్యానించారు. కాగా, తనకు మద్ధతు తెలిపిన తెలంగాణ ఎన్ఆర్ఐలకు ఈటల రాజేందర్ ధన్యావాదాలు తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు.

ఇదిలాఉంటే.. సోమవారం శామీర్‌పేటలో ప్రెస్‌మీట్ అనంతరం తన సొంత నియోజకవర్గం అయిన హుజూరాబద్‌కు వెళ్లారు ఈటల రాజేందర్. నియోజకవర్గం పరిధిలోని తన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలతో సంప్రదింపులు జరిపారు. అంతేకాదు.. ఇవాళ కూడా హుజూరాబాద్ నియోజకవర్గం కార్యకర్తలతో ఈటల రాజేందర్ మరోసారి భేటీ కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం తన భవిష్యత్ కార్యాచరణపై ప్రకటించే అవకాశం ఉందని ఈటల రాజేందర్ అనుచరులు చెబుతున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. అవమానించి గెంటివేసిన టీఆర్ఎస్‌పై ఈటల పోరాటం సాగిస్తారని అంటున్నారు. మరోవైపు ఈటల రాజేందర్‌కు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం మద్ధతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ ల నుంచి పలువురు నేతలు ఆయన బహిరంగంగానే మద్ధతు ప్రకటించారు. మరి ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడతారా? లేదా ఏదైనా పార్టీలో చేరి కేసీఆర్‌పై తిరుబాటు జెండా ఎగురవేస్తారా? అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.

Also read:

12 ఏళ్ళ పిల్లలకూ ఇక వ్యాక్సిన్, ఫైజర్ కంపెనీకి అధికారాలు ఇవ్వనున్న అమెరికా ? త్వరలో ఆమోదం లభించే సూచన

Ravi Teja’s Khiladi: కరోనా కష్టకాలం.. వాయిదాపడ్డ మాస్ మహారాజ ‘ఖిలాడి’.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే