Etela Rajender: కవిత పాత్ర ఉందో‌.. లేదో దర్యాప్తులో తేలుతుంది.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈడీ అదుపులో ఉన్న నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటంతో బీజేపీ సహా పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Etela Rajender: కవిత పాత్ర ఉందో‌.. లేదో దర్యాప్తులో తేలుతుంది.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల కీలక వ్యాఖ్యలు..
Etela Rajender, Mla
Follow us

|

Updated on: Dec 01, 2022 | 3:55 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈడీ అదుపులో ఉన్న నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటంతో బీజేపీ సహా పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందో‌ లేదో.. దర్యాప్తులో తేలుతుందంటూ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుడైన కానిస్టేబుల్ కిష్టయ్య 13వ వర్ధంతి సందర్భంగా గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్ద.. ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చాలదన్నట్లు దోచుకోవటానికి కేసీఆర్ కుటుంబం ఢిల్లీ మీద పడిందని విమర్శించారు. టీఆర్ఎస్ ను మట్టి కరిపించే శక్తి బీజేపీకి మాత్రమే ఉందంటూ పేర్కొన్నారు. కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఈటల డిమాండ్ చేశారు.

ఇక్కడ దోపిడీ సరిపోదు అన్నట్టుగా.. ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటూ ఈటల ప్రశ్నించారు. ఇక్కడ ధరణి పేరిట వేలాది ఎకరాల భూములను చరబట్టి, పేదల భూములను మాయం చేసి వేలకోట్లరూపాయలు సంపాదించారు.. మాలాంటి వారిని ఓటగొట్టడానికి ఆ డబ్బులు ఖర్చు చేయడం వాస్తవం కాదా ? అని పేర్కొన్నారు. 2014 వరకు అటుకులు బుక్కి, ఉపాసముండి ఉద్యమాలు నడిపిన పార్టీ మాది అని కెసిఆర్ చెప్పేవారు.. ఉద్యమ సమయంలో ఉపఎన్నికల్లో తీసుకునే దిక్కు తీసుకోండి.. వేసుకునే దిక్కు వేసుకోండి అనీ చెప్పిన కేసీఆర్.. 2014 తర్వాత వేలకోట్ల రూపాయలు ఉప ఎన్నికలలో ఖర్చుపెట్టి, ఓట్లను కొనుక్కునే స్థాయికి ఎలా వచ్చారు? అంటూ ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్నారు.

ఏ పార్టీకి కూడా సొంత హెలికాప్టర్లు, విమానాలు లేవు. విమానాలు కొంటున్నమని చెప్పిన వ్యక్తి ఎవరు? హెలికాప్టర్లు పెట్టుకొని తిరుగుతా అని చెప్పిన వ్యక్తి ఎవరు? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తాతజాగీర్ లాగా ఇక్కడ నుంచి వేలకోట్ల రూపాయలు పంపించి తెలంగాణ ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తుంది ఎవరు? తనపార్టీఅకౌంట్లో అతి తక్కువ కాలంలోనే 870 కోట్ల రూపాయల వైట్ మనీ ఉందని చెప్పింది కేసీఆర్ కాదా? ఉపాసం ఉన్న పార్టీ..అటుకుల బుక్కిన పార్టీకి 8 సంవత్సరాల కాలంలోనే వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలందరూ ఆలోచన చేయాలి.. ఎవరికైనా డబ్బులు ఊరికినే ఇస్తారా? అంటూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..