Warangal: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్.. గందరోళంలో కాకతీయ యూనివర్సిటీ..
వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఆ వివాదాల సుడిగుండం నుండి విద్యార్థులకు దారి చూపాల్సిన పాలకవర్గం చేతులెత్తేసింది. మరోదారి లేక యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది. దీంతో విద్యార్థి లోకం అయోమయంలో చిక్కుకున్నారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు యూనివర్సిటీ అట్టుడికి పోయేలా చేస్తున్నారు.. అందులో భాగంగానే మంగళవారం ఉమ్మడి జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులను అందించిన ఘనత వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయానిది.

వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఆ వివాదాల సుడిగుండం నుండి విద్యార్థులకు దారి చూపాల్సిన పాలకవర్గం చేతులెత్తేసింది. మరోదారి లేక యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది. దీంతో విద్యార్థి లోకం అయోమయంలో చిక్కుకున్నారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు యూనివర్సిటీ అట్టుడికి పోయేలా చేస్తున్నారు.. అందులో భాగంగానే మంగళవారం ఉమ్మడి జిల్లా బంద్ కు పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఎంతోమంది గొప్ప గొప్ప మేధావులను అందించిన ఘనత వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయానిది. ఎన్నో ఉద్యమాలు ఈ విశ్వవిద్యాలయం లోనే పురుడు పోసుకున్నాయి. తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయుపట్టుగా నిలిచిన చరిత్ర ఈ విశ్వవిద్యాలయానిది. అలాంటి విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. విద్యార్థుల చదువులు సాగడం గండం లా మారింది..
నిత్య పోరాటాలతో ఈ విశ్వవిద్యాలయం అట్టుడికి పోతుంటే.. విద్యా వ్యవస్థ పూర్తిగా పడకేసింది. పరిపాలన గాడి తప్పడంతో విద్యార్థులు, అధ్యాపకులు అంతా అయోమయంలో చిక్కుకున్నారు. కొత్త కోర్సుల మాట దేవుడెరుగు యూనివర్సిటీ పరిపాలన గందరగోళంగా మారింది. పిహెచ్‌డి క్యాటగిరి- 2 అడ్మిషన్లు బారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, లక్షలాది రూపాయలకు అడ్మిషన్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ బాధిత విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో గత కొద్ది రోజులుగా యూనివర్సిటీ అట్టుడికి పోతుంది. ఈ నిరసనలు అదుపు తప్పడంతో వారం రోజుల క్రితం అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడించి హల్చల్ చేసిన బాధ్యత విద్యార్థులు వీసీ చాంబర్లోని ఫర్నిచర్, కంప్యూటర్లు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు ప్రతాపం చూపడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులకు వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఒకవైపు పీహెచ్డీ అడ్మిషన్ల వివాదం కొనసాగుతున్న క్రమంలోనే మరోవైపు పాలకవర్గం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు మరిన్ని కొత్త వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. యావత్ విద్య విద్యార్థి లోకాన్ని అయోమయంలో నెట్టేసింది. ఏకంగా 18వ తేదీ వరకు కాకతీయ విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించడంతో హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.
సుమారు 3000 మంది విద్యార్థులను ఇళ్లకు పంపి హాస్టల్ గదులు, మెస్ లకు తాళాలు వేశారు. నాన్ బోర్డర్స్ పూర్తిగా హాస్టల్స్ ఖాళీ చేసి బయటకు వెళ్లాలని సర్కులర్ జార్ చేశారు. దీంతో మరింత గందరగోళం నెలకొంది. మొదట గత నెల 24 తేదీ నుండి 5వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యలో ఆ సెలవులను 10వ తేదీ వరకు పొడిగించారు. కానీ వివాదం సద్దుమనగక పోవడంతో ఈ సెలవులు 18వ తేదీ వరకు పొడిగించారు. దీంతో విద్యార్థులు అయోమయంలో చిక్కుకున్నారు. ఓ విద్యార్థి తన జీవితం ఆగమైపోతుందని ఆత్మహత్యకు ఎక్కించడం ప్రతి ఒక్కరిని కలచివేసింది.
ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కేయూలో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రో తాటికొండ రమేష్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నాలు, నిరసన కార్యక్రమాలతో అట్టుడికి పోతుండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ దెబ్బతింటుందని, క్లాసులు జరగడం లేదు కాబట్టి సెలవులు ప్రకటించామని అధికారులు అంటున్నారు. విద్యార్థులందరినీ ఇళ్లలోకి పంపి మెస్ లకు, హాస్టల్స్ కు తాళాలు వేశమంటున్నారు.
విద్యార్థుల నుండి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలకవర్గం ఇలా చేతులెత్తేయడం సమంజసం కాదని, చేసిన తప్పుల నుండి తప్పించుకోవడం కోసం వేలాది మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేయడం సమంజసం కాదని పాలకవర్గంపై పలువురు వెడవులు, విద్యా వేత్తలు ధ్వజమెత్తుతున్నారు. పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ రోజు కేయూ జేఏసీ ఉమ్మడి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.. ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
