AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ED on KTR: కేటీఆర్‌పై మరో కేసు.. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. తాజాగా కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈకార్ రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్‌కు కాస్త ఊరట లభించినప్పటికీ, తాజాగా మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ.

ED on KTR: కేటీఆర్‌పై మరో కేసు.. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ
Ktr Ed Case
Balaraju Goud
|

Updated on: Dec 20, 2024 | 8:27 PM

Share

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. తాజాగా కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈకార్ రేసు కేసులో హైకోర్టులో కేటీఆర్‌కు కాస్త ఊరట లభించినప్పటికీ, తాజాగా మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది ఈడీ. ఏ1గా కేటీఆర్‌ పేరు చేర్చిన ఈడీ, ఏ2గా అప్పటి మున్సిపల్ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, ఏ3గా HMDA అధికారి BLN రెడ్డి పై కేసులు నమోదు చేసింది. తెలంగాణ ఏసీబీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది.

ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ ఏసీబీకి లేఖ రాశారు ED అధికారులు. కేటీఆర్‌పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరారు. ఎఫ్‌ఐఆర్ కాపీతోపాటు HMDA అకౌంట్‌ నుంచి ఎంత మొత్తం బదిలీ చేశారో వంటి వివరాలు ఇవ్వాలంటూ ED కోరింది. ప్రస్తుత HMDA కమిషనర్ దాన కిశోర్‌ ఫిర్యాదు కాపీ కూడా పంపాలని ED కోరింది. ఏయే తేదీల్లో లావాదేవీలు జరిగాయో ఆ వివరాలు కూడా చెప్పాలని ఈ లేఖలో ED కోరింది. ఈ క్రమంలో ఈడీ కేసు నమోదు చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి