AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చికోటి ప్రవీణ్ కేసులో సంచలనం.. నలుగురు ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు..

Telangana: చికోటి ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురు ప్రజాప్రతినిధులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు..

Telangana: చికోటి ప్రవీణ్ కేసులో సంచలనం.. నలుగురు ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు..
Chikoti Praveen
Shiva Prajapati
|

Updated on: Aug 05, 2022 | 8:16 PM

Share

Telangana: చికోటి ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నలుగురు ప్రజాప్రతినిధులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రవీణ్ స్టేట్‌మెంట్ ఆధారంగా నోటీసులు జారీ చేశారు అధికారులు. క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. అతను ఇచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం.. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపటి నుంచి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రవీణ్ ఇచ్చిన స్టేట్‌మెంట్, వాట్సాప్ చాట్ ఆధారంగా నోటీసులు జారీ చేయగా.. ప్రవీణ్, ప్రజాప్రతినిధుల మధ్య పలు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు ఈడీ గుర్తించింది.

విదేశీ కేసినోల వ్యవహారంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రవీణ్‌ను 3 రోజులు విచారించింది. ఈ విచారణలో అనేక కీలక వివరాలు వెల్లడించినట్లు తెలిసిందే. అలాగే, ప్రవీణ్ ట్రాన్సాక్షన్స్, వాట్సప్ చాటింగ్ సహా కీలక వివరాలను తెలుసుకున్నట్లు సమాచారం. ఈడీ విచారణ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు ప్రాణహానీ ఉందంటూ ప్రవీణ్ ప్రకటించారు. తనకు భద్రత కావాలంటూ పోలీసులను కోరాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us